లాక్ డౌన్ కొనసాగిస్తూనే మరింత మినహాయింపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వబోతున్న పరిస్థితులలో వచ్చేనెల మొదటి వారం నుండి మాల్స్ సెలూన్స్ ప్రారంభం కాబోతున్నాయని లీకులు వస్తున్నాయి. ప్రస్థుత పరిస్థితులలో లాక్ డౌన్ ఎక్కువకాలం కొనసాగించలేము అనీ దేశప్రజలు అంతా కరోనా తో జీవించే కళ నేర్చుకుని జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరేమార్గం లేదు అంటూ ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. 


దీనితో ఇక మినహాయింపులకు సంబంధించి లిస్టు చివరిలో ఉండే సినిమా షూటింగ్ లు సినిమా హాల్స్ ఓపెనింగ్ విషయమై కూడ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తూ జూన్ నెల నుండి సినిమా షూటింగ్ లను జూలై నెల నుండి సినిమా ధియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వాలు అంగీకరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈ లీకులు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి కూడ చేరడంతో ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సినిమాల విడుదలకు సంబంధించి మూడు అంచెల పధకాన్ని చాల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. 


తెలుస్తున్న సమాచారంమేరకు జూలై నెలలో ధియేటర్లు ఓపెన్ అయిన వెంటనే రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రదీప్ ’30 రోజులలో ప్రేమించడం ఎలా’ వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలు ప్రతి సినిమాకు ఒకవారం గ్యాప్ తో విడుదల అవుతాయి అని అంటున్నారు. ఆతరువాత ఆగష్టులో వచ్చే స్వాతంత్ర దినోత్సవం కృష్ణాష్టమి లను టార్గెట్ చేస్తూ నాని ‘వి’ రామ్ ‘రెడ్’ అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాలు విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 


ఆతరువాత సెప్టెంబర్ లో వచ్చే వినాయకచవితిని టార్గెట్ చేస్తూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘క్రిక్’ ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలను సెకండ్ ఫేజ్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసినిమాల ఫలితాలను బట్టి అక్టోబర్ లో వచ్చే దసరా కు పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ను విడుదల చేసి టాలీవుడ్ భారీ సినిమాల మూడవ ఫేజ్ ను ప్రారంభిస్తారని లీకులు వస్తున్నాయి. ఇలా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను అంతా సినిమా ధియేటర్లు ఓపెన్ కాకుండానే ఇండస్ట్రీ పెద్దలు తమ సినిమాలతో రిలీజ్ డేట్స్ ను బుక్ చేసుకుంటూ ప్రస్తుతం బిజీగా కాలం గడుపుతున్నారు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: