రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. యావత్ భారతదేశ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదటగా ఈ సంవత్సరం జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ రాజమౌళి, చిత్ర నిర్మాతలు మీడియా ముఖంగా తెలుపగా.. అది కాస్తా దసరాకి షిప్ట్ అయింది. కానీ కొన్ని షూటింగ్ పనులు వాయిదా ఉండడంతో వచ్చే ఏడాది 2021 జనవరి 8కి వాయిదా వేయడం జరిగింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మూవీ షూటింగ్స్ డిలే అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఖచ్చితంగా వాయిదా పడతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

తాజాగా సంక్రాంతికి కూడా ఆర్.ఆర్.ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారట. 30 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి పరిస్థితులలో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో మరో నాలుగు నెలలు 'ఆర్ ఆర్ ఆర్' విడుదల వాయిదా పడనుంది అని తెలుస్తుంది. 'రౌద్రం రణం రుధిరం' మూవీలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్'గా కనిపిస్తుండగా 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు చరణ్ ఇంట్రో వీడియో విడుదలయ్యాయి. 'అల్లూరి'గా రామ్ చరణ్ లుక్ చూసినప్పటి నుండి 'కొమరం భీమ్' గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక సినీ అభిమానులకు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్యారంటీగా స్పెషల్ వీడియో ఉంటుందని తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ వీడియో విడుదల పై సందిగ్దత కొనసాగుతుంది. ఎన్టీఆర్ బర్త్ డే కి ఇంక ఐదు రోజులే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ వీడియో మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: