15 ఏళ్లుగా ఒకటే మేకింగ్ స్టైల్ తో మాస్ మూవీస్ తో టాలీవుడ్ ని యాక్షన్ మయం చేసేశాడు బోయపాటి. 15 ఏళ్లుగా ప్రేక్షకుల చేత మాస్ జపం చేయిస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేశాడు బోయపాటి.  దర్శకుడిగా పరిచయం అయిన ఫస్ట్  మూవీ  రవితేజ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్‌ డ్రామా భద్ర. ఈ సినిమాతో రవితేజ మార్కెట్‌ రేంజే మారిపోయింది. మాస్ ఆడియన్స్‌లోనూ రవితేజ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. బోయపాటికి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ఛాన్స్ పక్కా అయ్యింది. భద్ర హిట్ అవ్వడంతో  ఏకంగా స్టార్ హీరో వెంకటేష్ తో తులసి సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు . వెంకటేష్ ని చాలా కాలం తర్వాత  అంత అగ్రెసివ్ యాక్షన్ రోల్ లో చూపించాడు బోయపాటి. తులసి కూడా సూపర్ హిట్ అయ్యింది.

 

రాయలసీమ పరిస్థితులకు కమర్షియల్ హంగులు జోడించి బోయపాటి శ్రీను తెరకెక్కించి న సింహా సినిమా కనకవర్షం కురిపించింది. బాలయ్య మార్క్ యాక్షన్‌ డైలాగ్స్‌ సినిమా రేంజ్‌ను పెంచాయి. దీనికి తోడు చాలా కాలం తరువాత బాలయ్యనుంచి ఫ్యాన్స్ కి నచ్చే  ఫ్యాక్షన్‌ సినిమా రావటంలో అభిమానులు సింహాకు బ్రహ్మారథం పట్టారు. బోయపాటిని స్టార్ డైరెక్టర్ ని చేశారు. ఇంత పెద్ద హిట్ తరవాత ఎన్టీఆర్ తో ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ మూవీ దమ్ము చేశాడు బోయపాటి. ఈ సినిమాలో  మాస్ లుక్ తో పాటు ఓవర్ గా యాక్షన్ చూపించడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

 

దమ్ము ఓవర్ యాక్షన్ సీన్స్ తో ఫ్లాప్ అయినా .. మళ్లీ అదే మాస్ ఫార్ములాకి ఇంకాస్త కమర్‌షియాలిటీ యాడ్ చేసి అటు సీనియర్ బాలయ్యతో చేసిన లెజెండ్ , ఇటు అల్లు అర్జున్ తో చేసిన  సరైనోడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల్లో కూడా  హీరో కొట్టిన ఒక దెబ్బకే పడిపోయే 100 మంది విలన్లు ,  స్క్రీన్ నిండా జనం.. భారీ యాక్షన్ సీన్స్ ఇలా.. తన రొటీన్ ఫార్ములాని కాస్త టైమింగ్ లో ప్రజెంట్ చేసి సూపర్ హిట్స్ కొట్టాడు . 

 

ఈ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వత  యంగ్ మీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో చేసిన మాస్ మూవీ  జయజానకీ నాయక యావరేజ్ అనిపించుకుంది. అప్పటి వరకూ ఒక్కసక్సెస్ కూడా లేని సాయికిఈ సినిమా కాస్త బూస్టప్ ఇచ్చింది.  ఆ తర్వాత రామ్ చరణ్ తో ఊరమాస్ సినిమా వినయవిధేయరామ చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమాకు మించిన బడ్జెట్ తో పాటు.. అసలు అర్ధం పర్దం లేకుండా స్టోరీ తెరకెక్కించి  జనాలు పారిపోయేంత ఓవర్ యాక్షన్ చేయించాడు బోయపాటి.

 

వినయవిధేయరామ ఫ్లాప్ తో బోయపాటితో అంతకు ముందు సినిమాలు చేద్దామని కమిట్ అయిన వాళ్లందరూ కామ్ అయిపోయారు. సింహ, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బోయపాటికే మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా  వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతోంది. అంతకుముందులా మరీ మాస్ మూవీ కాకుండా ఒక మోస్తరు మాస్  తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈసారి ద్రుష్టిలో పెట్టుకుని సినిమా చేస్తున్నాడు బోయపాటి. 15 సంవత్సరాల్లో చేసింది 8 సినిమాలే  అయినా అవన్నీ.. పక్కా మాస్ కమర్‌షియల్ ఎంటర్ టైనర్సే.

మరింత సమాచారం తెలుసుకోండి: