టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన జంటల్లో మహేష్ బాబు నమ్రత ఒకరు. వీరి వివాహం నుంచి వీరి కెరీర్ వరకు అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్తూ ఉంటారు. కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు మహేష్ బాబు ఆమెను వివాహం చేసుకున్నాడు. మహేష్ బాబు జీవితంలో ఆమె నేడు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. మహేష్ బాబు చేసే సినిమాల నుంచి ఆయన వ్యాపారాల వరకు అన్నీ కూడా ఆమె పెత్తనమే నడుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మహేష్ బాబు సినిమా కథలు అన్నీ కూడా ఆమె విని ఓకే చెయ్యడమే అని అంటారు. 

 

అది మహేష్ బాబు కెరీర్ లో చాలా కీలకం అయింది అని కూడా అంటారు. ఆ విధంగా నమ్రత కథలు విన్న తర్వాతే మహేష్ బాబు ఫ్లాపు సినిమాల నుంచి చాలా వరకు బయటకు వచ్చాడు అనేది టాలీవుడ్ జనాల మాట. మహేష్ బాబు నిర్మించే సినిమాల విషయంలో కూడా ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మహేష్ బాబు పారితోషికం కూడా ఆమె ఫైనల్ చేయడమే అని సమాచారం. ఆమెకు మహేష్ పూర్తి స్వేచ్చ కూడా ఇచ్చాడు అని చెప్తారు. పిల్లల విషయంలో అంతా ఆమె పెత్తనమే అనేది టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. 

 

ఆమెకు చెప్పకుండా అసలు మహేష్ బాబు అసలు ఏ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయదు అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమె విషయంలో ప్రతీ చిన్న జాగ్రత్త కూడా తీసుకుంటూ ఉంటాడని, ఆమె కూడా మహేష్ బాబు కెరీర్  విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి అడుగు వేస్తుంది అని అంటారు. మహేష్ బాబు అంటే ఆమెకు చాలా గౌరవం అని కూడా అంటారు. ఇప్పుడు మహేష్ రెండు సినిమాలు ఓకే చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: