బర్త్ డే వచ్చేస్తోంది. అందుకే ఆశగా ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారు హీరోలు. అభిమాన హీరోల బర్త్ డే వచ్చేస్తోంది. ఏ సినిమా ఓపెనింగ్ అంటాడో, ఓపెన్ అయిన సినిమాలోనుంచి ఏమైనా చూపిస్తాడో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు . ఈ నెల 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే . ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు . ఈ సినిమాలో కొమరం భీమ్ గా కనిపిస్తున్నాడు.

 

మొన్నీమధ్య రామ్ చరణ్‌ బర్త్ డే రోజు అదిరిపోయే  టీజర్ ఇచ్చిన రాజమౌళి.. ఎన్టీఆర్ బర్త్ డే కి కూడా మాంచి విజువల్ ట్రీట్ ఇస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అతేకాదు ఆల్రెడీ అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ మూవీ నుంచి లుక్ రిలీజ్ చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ .

 

ఇక ఈ నెల ఆఖరు మే 30న  సూపర్ స్టార్ కృష్ణ  పుట్టిన రోజు .  తండ్రి పుట్టిన రోజు నాడు మహేష్ బాబు అనౌన్స్ మెంట్స్ తో రెడీ అవుతున్నాడన్న వార్తలు టాలీవుడ్ లో నడుస్తున్నాయి. మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఓపెనింగ్ తో పాటు రాజమౌళితో మహేష్ నెక్ట్స్ ఇయర్ చెయ్యబోయే ప్రాజెక్ట్ కి సంబందించ  అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ .

 

ఈ నెలలోనే కాదు నెక్ట్స్  మన్త్ జూన్ 10 న బాలకృష్ణ  పుట్టినరోజు. బాలయ్య పుట్టినరోజుకు  కూడా రిటర్న్ గిఫ్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.  ప్రజెంట్ బోయపాటితో తెరకెక్కుతున్న సినిమాకు సంబందించి టీజర్ తో పాటు నెక్ట్స్ బి.గోపాల్ బాలకృష్ణ సినిమాకు సంబందించి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది.. తన పుట్టినరోజున అనౌన్స్ చేస్తాడని అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: