రానా... అటు బాలీవుడ్ లో అయిన ఇటు టాలీవుడ్ లో అయినా ఎక్కడ అయినా సరే ఈ పేరు వినపడుతూనే ఉంటుంది. అతని సినిమాలు అతని కెరీర్ గురించి ఎప్పుడు ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది. రానా ఎప్పుడు కూడా దూకుడుగా సినిమాలు చేయలేదు సినిమా హిట్ ఫ్లాప్ అనే దాని మీద ఆధారపడి సినిమాలు చేసిన సందర్భం అనేది కూడా ఎక్కడా లేదు అని చెప్తూ ఉంటారు. కెరీర్ లో ఎందరో దర్శకులు అతని తో పని చేసినా సరే రానా విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మిస్ అయ్యాం అనే బాధలో ఉండే వారు కాదట. 

 

ఆ విధంగా సినిమాలు చేస్తూ ఉంటాడు రానా. ఇక అతని పెళ్లి విషయానికి వస్తే రానా కు చాలా మంది అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలూ ఉండేవి అని చెప్తూ ఉంటారు. అతను చాలా మంది తో ప్రేమలో పడ్డాడు అని అంటారు. కాని అతను ఇప్పుడు మిహీకా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు. పెద్దల సమ్మతి తో ఆయన ఈ వివాహం చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. ఈ వివాహం ఈ ఏడాది చివర్లో ఉండే అవకాశం ఉంది అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఆయన తండ్రి సురేష్ బాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇక రానా ఈ వివాహం చేసుకోవడం వెనుక ఒక వ్యాపార వేత్త కూడా ఉన్నారు అని అంటారు. వీరి వివాహం విషయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు అని చెప్తూ ఉంటారు. రానా కెరీర్ లో కూడా ఆయన చాలా హెల్ప్ చేసారు అని ఆయన ది చెన్నై అని అంటారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని రానా పెళ్లి మాత్రం ఫిక్స్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: