కోలీవుడ్ హీరో ఆర్య హీరోయిన్ సయేశా సైగల్ ను ప్రేమించి పెళ్లాడాడు. తమిళ యాక్షన్ హీరోలలో ఆర్య ఒకడు. అందానికి అందం.. మాస్ హీరో కావాల్సిన కటౌట్ అతనికి ఉంది. అయిదు సరైన సినిమాలు చేయక అతని కెరియర్ ఆలా సాగుతుంది. అయితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుండే తమిళ హీరోల్లో ఆర్య ఒకరు. ఆర్య సయేషాని ప్రేమించి పెళ్లాడాడు. లాస్ట్ ఇయర్ వీళ్ళ మ్యారేజ్ జరిగింది. గజినీకాంత్ సినిమాలో నటించిన ఈ ఇద్దరు అభిరుచులు కలవడంతో ప్రేమించుకుని కొన్నాళ్లకే పెళ్లి చేసుకున్నారు. 


ఆర్య చేసిన గజినీకాంత్ సినిమా తెలుగులో నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఐతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఇదిలాఉంటే ఆర్య అనుష్కతో వర్ణ సినిమా చేశాడు. ఆ సినిమా టైం లో ఆర్య, అనుష్కల మధ్య ఎఫైర్ నడుస్తుందని చాల వార్తలు వచ్చాయి. అనుష్క కూడా ఆర్య మీద ప్రేమ చూపించడం హాట్ న్యూస్ గా మారింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ అనుష్కని సైడ్ చేసి సయేశాతో జీవితం పంచుకున్నాడు ఆర్య. 


వేళ్ళ మ్యారేజ్ హైదరాబాద్ లోనే జరగడం విశేషం. ప్రస్తుతం ఆర్య తమిళంలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. పెళ్ళి తర్వాత కూడా సయేశా సినిమాలు చేసేందుకు సై అంటుంది. సమంత బాటలో సయేశా కూడా సెలెక్టెడ్ సినిమాలు చేయాలని అనుకుంటుంది. అమ్మడు మొదటి సినిమా తెలుగులోనే చేసింది. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన అఖిల్ సినిమాలో సయేశా సైగల్ నటించింది. అయితే ఆమె ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద మాత్రం ఇంకా ఎలాటి న్యూస్ బయటకు రాలేదు. మొన్నటిదాకా హనీమూన్ ఎంజాయ్ చేసి వచ్చిన ఆర్య, సయేశా వారి పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: