కరోనా ప్రభావంతో ఎన్నో సినిమాల షూటింగ్ లు ఆగిపోయినా అందరి దృష్టి మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. దీనికి కారణం కరోనా వల్ల కళ తప్పిన ఇండస్ట్రీకి తిరిగి ‘ఆర్ ఆర్ ఆర్’ తోనే పూర్వపు వైభవం వస్తుంది అన్న నమ్మాకం. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఎప్పుడు అవుతుంది అన్న విషయమై ఆసక్తి పెరగడమే కాకుండా ఈ మూవీ విడుదలను బట్టి మిగతా భారీ సినిమాల విడుదలను లింక్ చేసుకుంటున్నారు.

 

ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిర్మాత దానయ్య ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. అందరు అనుకుంటున్నట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదాపడదు అనీ ఖచ్చితంగా ఈ మూవీ జనవరి8, 2021న విడుదల అవ్వడం ఖాయం అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు.

 

అంతేకాదు ఈసినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తి అయిందని పూణేలో షూట్ చేయాలి అనుకున్న సీన్స్ షూటింగ్ లకు సంబంధించి నిబంధనల సడలింపులు వచ్చిన వెంటనే తాము ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నాము అంటూ దానయ్య ఈ మూవీ విడుదలకు సంబంధించి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇస్తున్నారు. అంతేకాదు ఈనెల 20న రాబోతున్న జూనియర్ పుట్టినరోజునాడు తమ ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ నుండి ఒక బహుమతి ఉంటుందని దీని విషయమై ప్రస్తుతం రాజమౌళి వర్క్ చేస్తున్నాడు అంటూ తారక్ అభిమానులకు ఒక స్వీట్ న్యూస్ చేరవేశాడు.

 

అయితే ఈరోజు దానయ్య ఇచ్చిన ఇంటర్వ్యూను నిశితంగా పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు మాత్రం వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అన్న ఉద్దేశ్యంతో భారీ అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లలో మానసిక ధైర్యం నింపడానికి దానయ్య ఇలా వ్యూత్మకంగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వాయిదా పడదు అంటూ లీకులు ఇస్తున్నాడు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఏమైనా జూనియర్ పుట్టినరోజునాడు రాజమౌళి తమ హీరోకు పుట్టినరోజు కానుక ఇస్తున్నాడు అన్న విషయం మాత్రం దానయ్య మాటలను బట్టి స్పష్టంగా అర్ధం అవుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: