సాధార‌ణంగా సినీ తారల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు ప్రజలకు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా ఆయా సినీ తారల అభిమానులకు అయితే పండ‌గ చేసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమకి సంబందించిన అన్ని ముఖ్య విషయాలు మీడియాకి దూరంగా రహస్యంగా కానిచ్చేస్తున్నారు. ఆ త‌ర్వాత అవి బ‌య‌ట ప‌డ‌డంతో.. అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అలాంటి వాటిలో హీరోయిన్ శ్రియ పెళ్లి కూడా ఒక‌టి.  తెలుగులో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఇష్టంతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రియ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు ఆంగ్లంలోనూ నటించి తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకుంది. 

 

చిరంజీవి,బాల‌కృష్ణ‌,వెంకీ, నాగ్ వంటి సీనియ‌ర్ల హీర‌ల‌తో న‌టిచింది ఈ బామ‌.  ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగగింది శ్రియ‌. అయితే శ్రియ కొన్నేళ్ల కింద‌టే ర‌ష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపార‌వేత్త ఆండ్రీ కొషీవ్‌ను ర‌హ‌స్యంగా పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఆండ్రీతో ప్రేమలో పడ్డ శ్రీయ 2018 మార్చి లో రాజస్థాన్ లో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే రహస్యంగా జరిగింది. ఇక ఇండస్ట్రీ నుంచి కేవలం మనోజ్ బాజ్‌పేయ్‌, అతని భార్య షబానా అజ్మీ మాత్రమే ఈ పెళ్లికి హాజరుకాగా, ఇంకా ఆమె క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు హాజరయ్యారు.

 

అయితే ఎందుకు ఇంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది అని ఆమెను అడ‌గ‌గా.. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు.. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పుకొను. గోప్యంగా ఉంచేందుకే ఇష్టపడతా. నా జీవితం గురించి అందరికి తెలియాలని అనుకోను. అందుకే పెళ్లి గురించి బహిరంగంగా చెప్పలేదని.. నాకు సింపుల్ గా ఉండ‌డ‌మే ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది ఈ బ్యూటి. ఇక వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తుండడాన్ని కారణం తన భర్తే అని శ్రీయ వివ‌రించింది.  నా భర్తకు నేను నా వృత్తిలో బిజీగా ఉండడం అంటేనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: