కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఉధృతి బాగా ఉన్న దేశాల్లో పూర్తి లాక్డౌన్ ని విధించాయి. ఇంకా మందు కనుక్కోబడని ఈ వైరస్ గురించి జనాల్లో ఆందోళన రోజు రోజుకీ పెరిగిపోతుంది. లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని వాయిదా వేయడమే తప్ప నివారించలేమని చెప్తున్న నేపథ్యంలో లాక్డౌన్ లో సడలింపులు ఇస్తున్నారు. అయితే వైద్య సదుపాయాలు అంతంతంగా ఉన్న దేశాల్లో లాక్డౌన్ ని మించిన ఆయుధం లేదని వాదిస్తున్నారు.

 

 

కరోనా వల్ల ప్రతీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అలా నష్టపోయిన వారిలో చలన చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు మూసివేయడంతో సినిమా రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. వేసవి సెలవుల్లో సినిమాలకి మంచి మార్కెట్ ఉంటుందన్న కారణంగా, సినిమాలన్నీ వేసవిని టార్గెట్ చేసుకున్నాయి. కానీ అనుకోకుండా కరోనా ముప్పు పెరగడంతో రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియట్లేదు.

 

 

కాకపోతే జూన్ నుండి సినిమా షూటింగులకి అనుమతి దొరుకుతుందన్న ఆశాభావాలు వ్యక్తం కావడంతో ఒక నెల ఆలస్యమైనా థియేటర్లు తెరుచుకుంటాయని అనుకుంటున్నారు. అయితే థియేటర్లు తెరుచుకున్నా మునుపటిలా పరిస్థితి ఉండకపోవచ్చు. సినిమా చూసే అనుభవమే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలు కొత్త పద్దతులని అవలంబించబోతున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ వారు కూడా సినిమా వారికి సహకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 

సెన్సార్ నియమాల్ని కొద్దిగా సడలించి ఈ-మెయిల్ ద్వారా సర్టిఫికేట్ ఇచే ప్రయత్నం రాబోతుందట. ఈ మేరకు ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ సర్టిఫికేట్ బోర్డు కృషి చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే నిర్మాతలకి సెన్సార్ పరంగా ఉండే ఇబ్బందులు తగ్గినట్టే. మరి అన్నీ కుదిరి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: