తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన హీరో నాచురల్ స్టార్ నాని. నాచురల్ నటనతో ఇంటి పక్క అబ్బాయి ల అనిపిస్తూ ఏకంగా ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని . కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుస విజయాలు అందుకుంటూ ఓటమి లేని  హీరోగా దూసుకుపోయాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. అయితే నాని ఏదైనా సినిమాలో నటించాడు అంటే అచ్చం పక్కింటి అబ్బాయి సినిమా లో ఉన్నాడేమో అన్నట్లుగా ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ ఉంటాడు. 

 

 అయితే ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని లవ్ స్టోరీ నిజంగానే పక్కింటి అబ్బాయి లవ్ స్టోరీలా ఉంటుంది. నాని లవ్ స్టోరీ మొత్తం ఫేస్బుక్లోనే సాగిపోయింది. సంజన అనే అమ్మాయి నాని కి  ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమ సాగరంలో మునిగి తేలారు ఈ జంట.  ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎక్కడ మీడియాకు మాత్రం చిక్కలేదు. 

 

 

 కానీ సడన్గా నాని పెళ్లి ప్రస్తావన తీసుకు రావడంతో మీడియా కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఓ  సమయంలో సంజన అనే అమ్మాయితో ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారి అది పెళ్లి వరకు వచ్చిందని అంటూ నాని చెప్పుకు  వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాని సంజన జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరి ప్రేమకు గుర్తుగా ప్రస్తుతం రెండేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయికి అర్జున్ అనే పేరు పెట్టారు ఇద్దరు దంపతులు. ఇద్దరు దంపతులు తెర మీద అంతగా కనిపించకపోయినప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం ఈ జంట ఫేవరెట్ గానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: