తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు తమ సహ నటులతో ప్రేమలో పడి ఎన్నో ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఇలా సహ నటులతో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నా ప్రేమ జంటలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఇది కేవలం ఇప్పటిది కాదు ఒకప్పుడు కూడా ఇలా ప్రేమ పెళ్లిళ్లు టాలీవుడ్ లో చాలానే జరిగాయి. ఇలా జరిగిన ప్రేమ పెళ్లిళ్ళ లో ఒకటి శ్రీకాంత్ ఊహ పెళ్లి. అప్పట్లో స్టార్ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో దగ్గరైన శ్రీకాంత్ తనదైన నటనతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 

 ఇక హీరోయిన్గా ఊహ కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది .ఓ  సినిమాలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా స్నేహం కాస్తా ప్రేమగా మారి పోయింది. ఎన్నో ఏళ్ల పాటు ఈ ప్రేమ జంట ప్రేమ సాగరంలో మునిగి తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే శ్రీకాంత్ ఊహ జంట అన్యోన్యతకు మారుపేరుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకరికి పట్ల  ఒకరు ఎంతో అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఒకరి కెరియర్ ని  ఒకరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. 

 

 

 ప్రస్తుతం శ్రీకాంత్ కొన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అటు ఊహ  కూడా పలు సినిమాల్లో నటిస్తూ తన కెరియర్ పరంగా బాగానే రాణిస్తోంది. ఇలా ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరికీ ప్రేమ జంట గా ఎప్పటికీ ఫేవరేట్ గా నిలుస్తారు. కాగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న జంటల్లో శ్రీకాంత్ ఊహ జంట ఎంతో అన్యోన్యమైనదిగా చెబుతూ ఉంటారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఊహ ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు కాగా వీరి పెద్దకొడుకు ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: