టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కెరీర్ లో చేసిన సినిమాలు ఆయన సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. టాలీవుడ్ లో ఆయన పేరు ఇప్పటికి ఒక సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఆయన జీవితంలో వ్యక్తిగతంగా అయినా రాజకీయంగా అయినా సరే చూడని విజయాలు లేవు అనేది అందరికి తెలిసిందే. ఇక ఆయన జీవితంలో ఆయన భార్య... బసవ తారకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భార్యను అమితంగా ప్రేమించే వ్యక్తి ఎన్టీఆర్ అని ఇప్పటికి చెప్తూ ఉంటారు. 

 

ఆయనకు భార్య చాలా బలం అనేది టాలీవుడ్ జనాల మాట. ఆయన భార్య మాటను దాటి ఏ ఒక్కటి చేసే వారు కాదట. ఇక పిల్లల విషయంలో ఆమె చూపించిన శ్రద్ధ గాని పిల్లల విషయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు గాని నేడు వారి జీవితాలను ఇలా ఉంచాయి అనేది ఎన్టీఆర్ అప్పట్లోనే అనుకునే వారు అని చెప్తూ ఉంటారు. ఆమెకు క్యాన్సర్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారట, ఆమెకు వైద్యం చేయించడానికి అవసరం అయితే తాను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను అని అనే వారట. ఆమె గురించి ఆయన చాలా కష్టాలు పడ్డారు అని చెప్తూ ఉంటారు. 

 

ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్టీఆర్ తిరగని దేశం లేదని ఎన్టీఆర్ భార్య మరణం తర్వాత చాలా వరకు ఒంటరి జీవితాన్ని గడిపారు అని ఆ సమయంలో ఆయన ఎవరి మద్దతు కోరుకున్న సందర్భం లేదని చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ సినీ జీవితం ఆరంభం లో ఆమె నుంచి వచ్చిన మద్దతు గురించి ఇప్పటికి కుటుంబంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఆయనకు ఆమె అంత జాగ్రత్తగా అండగా నిలిచారట. అందుకే ఎన్టీఆర్ ఆమె విషయంలో అంత సీరియస్ గా ఉండే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి: