టాలీవుడ్ లో అల్లు అర్జున్ హవా ఇప్పుడు ఒక రేంజ్ లో నడుస్తుంది. బన్నీ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ చేసిన అల వైకుంఠపురములో సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత బన్నీ పుష్ప అనే సినిమా లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది పక్కన పెడితే అతని కెరీర్ లో భార్య గురించి చాల బాగా చెప్పుకోవచ్చు అనేది టాలీవుడ్ జనాల మాట. 

 

ఆమె బన్నీ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అతనిలో చాలా మార్పులు వచ్చాయి అనేది కొందరు పదే పదే చెప్తూ ఉంటారు. ఆమె రాక ముందు బన్నీ కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే దగ్గర అయ్యాడు గాని క్లాస్ ఆడియన్స్ కి దగ్గర కాలేదు. కాని ఆమె వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా బన్నీ ని ఆదరించే విధంగా చేసారు అంటారు. కథల ఎంపిక విషయంలో కుటుంబం కోణం ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు అని అంటారు. అది బన్నీ కి బాగా ప్లస్ అయింది అనేది చాల మంది చెప్తారు. అతని బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆమె చాలా మార్పులు చేసారట. 

 

ఆయన మాస్ కి దగ్గర అయ్యే విధంగా మావయ్య చిరంజీవిని ఫాలో అయ్యే వారు అని కాని స్టైల్ కాదు నటన ఆకట్టుకోవాలని ఆమె చెప్పడం తోనే బన్నీ కెరీర్ నేడు అలా ఉంది అని అంటారు. బన్నీ ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమా ద్వారా కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాత జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: