ప్రపంచ దిగ్గజ ఓపెనర్ల లో ఒకరైన డేవిడ్ వార్నర్ మైదానంలోకి గాడు అంటే సృష్టించే  విధ్వంసం మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఒకసారి వార్నర్ మైదానంలోకి గాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. క్రికెట్ లో తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఎప్పుడూ దుమ్ము రేపుతూ ఉంటాడు డేవిడ్ వార్నర్. అయితే మొన్నటి వరకు క్రికెట్లో బ్యాటుతో దుమ్ముదులిపిన డేవిడ్ వార్నర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోగా మారిపోతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్  సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లన్నీ నిలిచిపోవడంతో క్రికెట్ ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉంది స్టార్ హీరోగా మారిపోతున్నారు డేవిడ్ వార్నర్. 

 


 ముఖ్యంగా తెలుగు ప్రజలకు సూపర్ హీరో అయిపోతున్నాడు.  తాజాగా టిక్ టాక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన డేవిడ్ వార్నర్ టిక్ టాక్  లో తన ఫ్యామిలీతో కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షిస్తూ అదరగొడుతున్నాడు. మైదానంలో   భారీ పరుగులు రాబట్టే  డేవిడ్ వార్నర్... టిక్ టాక్ లో తెలుగు పాటలు పై డాన్స్ ఇరగదీస్తాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ తెలుగు పాటల పై డాన్స్ చేస్తుండడంతో తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు... మొన్నటికి మొన్న రాములో  రాముల అనే అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో  సినిమాలోని పాటకు డాన్స్ స్టెప్పులు వేసిన అదరగొట్టాడు  డేవిడ్ వార్నర్.

 


 తాజాగా ఫ్యామిలీతో కాకుండా తానొక్కడే సింగిల్గా అదే పాటకు మరోసారి డాన్స్ చేసి... తెలుగు అభిమానులందరినీ ఫుల్ ఖుషి చేశాడు. రాములు రాముల పాట కి డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.డేవిడ్ వార్నర్ టిక్  టాక్ వీడియో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కువ తెలుగు పాటల మీద దృష్టిపెట్టిన వార్నర్ ... బాగా ఫేమస్ అయిన పాటలపై డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇప్పుడు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Woke the beast 😂😂 what can you see with your eyes at the end?? #challenge #gettingbetter #fun #justsmile

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: