టాలీవుడ్ లో ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, నటుడిగా తన సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించారు. అప్పటి వరకు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అలీని  హీరోగా పరిచయం చేస్తూ తీసిన యమలీల సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  కమెడియన్ గా ఉన్న అలీసినిమా తరువాత హీరోగా మారిపోయారు. పెద్ద హీరోలతో కాకుండా చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ మంచి విజయాలు అందున్నాడు  ఎస్వీ కృష్ణారెడ్డి. మ్యూజిక్, డ్యాన్స్, డైరెక్షన్ ఒక్కటేమిటి మల్టీటాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నారు.  రాజేంద్రప్రసాద్, అలీ తో చేసిన సినిమాలు విజయవంతం అయ్యాయి. ఒకానొక టైమ్ లో పెద్ద హీరోలతో రెండు సినిమాలు చేశాడు.   

 

అప్పటి నుంచి ఆయన పెద్ద హీరోల జోలికి వెళ్లలేదు. ఇక  కథ, కథనాలపై, సంగీతంపై కూడా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పట్టువుంది. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఈ విషయాలను నిరూపించాయి. గత కొంత కాలంగా ఆయన సినిమాల జోలికి వెళ్లడం లేదు.  దాంతో ఆయన సీరియల్స్ వైపుకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వంశీ, బాపు వంటి దర్శకులు సీరియల్స్ చేయగా, రాఘవేంద్రరావు వంటివారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి  సీరియల్స్ కి దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నట్టు తెలుస్తోంది.  

 

ఆయన సినిమాల్లో 'యమలీల' ఎంత గొప్ప హిట్ అయ్యిందో.. ఎంత ప్రత్యేకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ స్టోరీ లైన్  ను టచ్ చేస్తూ, ఆ కథకి కొనసాగింపుగా ఆయన తొలి సీరియల్ వుండనుందని అంటున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించడం వరకూ ఆయన చేస్తాడని చెబుతుతున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం బుల్లితెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఒకప్పుడు వెండి తెరపై తనదైన కామెడీ మార్క్ తో రారాజుగా నిలిచారు ఎస్వీకృష్ణారెడ్డి.. మరి బుల్లితెరపై ఆయన ప్రస్థానం ఎలా కొనసాగించనున్నారో తెలియాలి.  కాకపోతే ఇది అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: