ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చి 14 ఏళ్ళు అయ్యింది. దేవదాస్ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చాటాడు. 14 ఏళ్ల కెరియర్ లో 17 సినిమాలు చేసిన రామ్ కెరియర్ కొత్తలో అతని స్పీడ్ చూసి మరో యువ స్టార్ అదే జూనియర్ పవర్ స్టార్ రేంజ్ కు వెళ్లాడని భావించిన రామ్ పోతినేని తన సినిమాల సెలక్షన్స్ లోపం వల్ల కెరియర్ లో వెనకపడ్డాడు. 
దేవదాస్, జగడం సినిమాల తర్వాత టాలీవుడ్ కు మరో సూపర్ హీరో దొరికేశాడని అనుకున్నారు.

 

అయితే రామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెరియర్ లో వెనక్కి పడ్డాడు. అంతేకాదు యూత్ ఫుల్ సినిమాలు చేయాల్సిన టైం లో రామ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకుని తప్పుపని చేశాడు. రెడీ, మస్కా లాంటి సినిమాలు రామ్ కు హిట్ ఇచ్చాయి కానీ అతన్ని యూత్ ఆడియెన్స్ కు దూరం చేశాయి. ఇక కొన్నాళ్ళు వరుస ప్లాపుల్లో ఉన్న రామ్ ను నేను శైలజ తో హిట్ ట్రాక్  కిషోర్ తిరుమల. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్, యాక్టింగ్ చేసే రామ్ చాల రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ టోన్ సెన్సేషనల్ హిట్ కొట్టాడు. 

 

జూనియర్ పవర్ స్టార్ రేంజ్ కు వెళ్లే సత్తా ఉన్నా సరే సినిమాల సెలక్షన్స్ లోపం వల్ల కేవలం ఎనర్జిటిక్ స్టార్ గా ఉన్నాడు రామ్. ఇక మీదట కథల విషయంలో కూడా తగిన జారత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు రామ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ తడం రీమేక్ లో నటిస్తున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: