తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన అందచందాలతో కుర్రకారుకి చక్కిలిగింతలు పెడుతున్న మిల్కీబ్యూటీ ఆ మద్య వచ్చిన బాహుబలి మూవీతో మంచి  క్రేజ్ వచ్చపడింది. హ్యాపీడేస్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్న తర్వాత అంత పెద్ద పేరు తీసుకు రాలేదు.  కొచెం ఇష్టం కొంచెం కష్టం, రచ్చ సినిమాలు కాస్త పేరు తెచ్చి పెట్టినా..బాహుబలి మూవీ తర్వాత ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. అయితే బాహుబలి 2 లో మాత్రం ఈ అమ్మడికి పెద్దగా ప్రియార్టీ ఇవ్వలేదు. ఈ మధ్యే బెంగాల్ టైగర్ సూపర్ హిట్ తో  వరుస  సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న తమన్నా అక్కినేని నాగార్జున, కార్తి హీరోలుగా నటిస్తున్న ఊపిరి తో పరవాలేదు అనిపించుకుంది.   సినిమా కథలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ఇలా నిర్మాతలకు అందుబాటులో ఉంటోంది ఈ అమ్మడు.

IHG

వరుస విజయాలతో జోరు మీద ఉన్న తమన్నా ఇలా తన రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కానంటుంది.  ప్రస్తుతం తెలుగు,తమిళ,హిందీలో కలుపుకుని ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ. అయినా పారితోషికం విషయంలో మాత్రం ఆమె ఎంతమాత్రం తగ్గడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో  దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె 3 కోట్లు డిమాండ్ చేసిందట.  

 

రెండున్నర కోట్ల వరకూ ఇస్తామని చెప్పినా ఆమె మెట్టుదిగి రావడం లేదని చెప్పుకుంటున్నారు. రవితేజకి  తమన్నాకి మధ్య మంచి స్నేహం వుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'బెంగాల్ టైగర్' అనే హిట్ మూవీ చేశారు. మరి వీరిద్దరి స్నేహంతో ఏమైనా కాస్త మెట్టు దిగుతుందో లేదో చూడాలి. నిర్మాతలు, ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఆలోచనలో పడ్డారని సమాచారం. చివరిగా ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే కానీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: