అద్భుతాలు  ఒకసారే జరుగుతాయి. వాటిని చూసిన తరువాత అద్భుతం అనుకోవాలి. ఆ మాటకు వస్తే ప్రక్రుతిలో భాగమైన మగువలు ఎపుడూ అద్భుతమే. అందులో సౌందర్యరాశులు ఇంకా ఇంకా అద్భుతమే. అలాంటి ఓ అద్భుతమే మాధురీ దీక్షిత్. ఆమె కుర్ర గుండెల మోత. యువ హ్రుదయాల జేగంట.

 

మాధురి సరిగ్గా ఇదే రోజున అంటే మే 15 1967లో పుట్టారు. ఆమె పుట్టినపుడు అందగత్తె. అయితే వెండితెర మీద తన అందాన్ని పరచేసి పడుచు హ్రుదయాలని కట్టిపడేసిన తరువాత తెలిసింది అందం ఆమెతోనే పుట్టిందని. ఒక తరాన్ని ఆమె ఉర్రూతలూగించారు. ఆమె సినిమా అంటే చాలు యూత్ క్యూ కట్టే సీన్లు 90ల్లో నడిచాయి.

 

ఆమె హీరోయిన్ అంటే చాలు సినిమా హాళ్ళలో  టికెట్లు తెగేవి. ఆమె బాక్సాఫీస్ qఉఈన్ గా ఒక వెలుగు వెలిగారు.  చోలీకే పీచే క్యా హై అని ఆమె అంటే చాలు కొంటె ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయేవి. ఆ పాటకు ఇప్పటికి రెండున్నర పదుల వయసు ఉంది. కానీ ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది.

 

ఇక మాధురి పేరులోనే మాధుర్యం ఉంది. ఆమె వన్ టూ త్రీ అంటూ సాంగ్ అందుకోగానే పడి పడి లేచే వయసుతో పరుగులు తీసేయడం అందరికీ తెలిసింది. మాధురి తన తడాఖాను చూపించి బాలీవుడ్ ని షేక్ చేశారు. ఆమె పక్కన హీరోలు జంట కట్టాలని ఉబలాటపడ్డారూ అంటేనే తెలుస్తోంది మాధురి క్రేజ్ ఎలాంటిదో.

 

ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్లో అంతకు ముందూ ఆ తరువాత ఎంతో మంది హీరోయిన్లు రావచ్చు కానీ మాధురి మాత్రం ఒక స్పెషల్, సూపర్ డూపర్ హిట్లు ఆమె సొంతం. ఆమె ఒక చరిత్ర స్రుష్టించారు. ఆమెతోనే బాలీవుడ్ అన్నంతగా శాసించింది.

 

నాటి తరాన్ని వెండి తెరపై వెర్రెక్కిస్తే ఆ పాత సినిమాలతో నేటి తరాన్ని బుల్లితెర పైన కూడా కవ్విస్తోంది.  ఆమెకు ఎంత వయసు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. మాధురి ఎప్పటికీ స్వీట్ సిక్టీనే. అందుకే ఆమె ఒక అద్భుతం. అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: