పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రౌద్రం,రణం ,రుధిరం(ఆర్ఆర్ఆర్) విడుదల మరోసారి వాయిదాపడనుందని సంకేతాలు ఇచ్చాడు నిర్మాత  డివివి దానయ్య. నిజానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఈఏడాది జులై  30న విడుదలచేద్దాం అనుకున్నారు కానీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లు ఇద్దరు గాయపడడం తో అనుకున్న టైం కు షెడ్యూల్స్ పూర్తికాలేదు దాంతో వచ్చే ఏడాది జనవరి 8న ఎలాగైనా థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ తేదికి కూడా వచ్చేలా లేదని స్వయంగా దానయ్యనే వెల్లడించాడు.
 
ఆర్ఆర్ఆర్ షూటింగ్ 70 శాతం పూర్తయింది కానీ కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది అయితే  ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కొద్దీ మంది స్టాఫ్ తో షూటింగ్ ను పూర్తి చేస్తాం ఆతరువాత  విఎఫ్ఎక్స్ కు కూడా చాలా టైం పడుతుంది దాంతో వచ్చే ఏడాది జనవరి 8కి ఈసినిమా ను విడుదలచేయడం కష్టమేనని దానయ్య అన్నాడు. సో ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సమ్మర్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
 
ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈసినిమా నుండి  అతని పాత్ర తాలూకు టీజర్ విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో స్వాతంత్య్ర  సమరయోధులు కొమరంభీం ,అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్  కొమురం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు గా కనిపించనున్నాడు. వీరికి జోడిగా  అలియా భట్ తో ఒలీవియా మోరిస్ నటిస్తుండగా ప్రముఖ  బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్  కీలక పాత్ర లో కనిపించనున్నాడు. సుమారు 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: