తన తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శకుల విషయంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా చాల  జాగ్రత్తగా ఉంటాడు. అతని సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ కావడం తో తన అభిప్రాయాలను ఎక్కువగా దర్శకుల మీద రుద్దే ప్రయత్నం ఈ మధ్య కాలంలో ఎపుడు కూడా పవన్ కళ్యాణ్ చేయడం లేదు. కొమరం పులి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శక నిర్మాతలకు అనేక సూచనలు చేస్తూ వస్తున్నాడు. ఎవరిని కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టవద్దు అనే సలహాలను పవన్ ముందు నుంచి కూడా ఇస్తున్నారు అని అంటున్నారు. 

 

తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. సినిమా విషయంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టవద్దు అని తనకు తక్కువ బడ్జెట్ సినిమాలు చెయ్యాలని ఉందని లాభాలు అవే వస్తాయని ఇప్పుడు ఎక్కువగా పెట్టుబడి పెట్టి అనవసరంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. ఎవరూ కూడా ఇప్పుడు ఆస్తులు అమ్ముకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పవన్ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. తనకు కుదిరిన విధంగా సహాయం చేస్తాను అని పవన్ చెప్పారు అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా వేగంగా సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

ఈ సినిమాల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి ఆయన చేస్తున్నారు. ఏ సినిమా అయినా సరే బడ్జెట్ చాలా తక్కువగా ఉండాలి అని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. అనవసరంగా తర్వాత ఇబ్బందులు వద్దు అని చెప్పినట్టు తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు పవన్ ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. పవన్ నిర్మాతల గురించి దర్శకుల గురించి ఆలోచించడం నిజంగా  మంచి పరిణామం అని అగ్ర హీరోలు అందరూ కూడా ఇలా ఆలోచిస్తే ఈ కష్ట కాలంలో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: