టాలీవుడ్ లో ఇప్పుడు బుల్లి తెర నుండి చాలా మంది నటి, నటులు వెండి తెర పై తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో టి వి యాంకర్లు ముందు వరుసలో ఉంటున్నారు. అయితే బుల్లి తెర మీద అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ కూడా సినిమాలలో గ్లామర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వరుస సినిమాలతో, టివి షో లతో చాలా బిజీ గా ఉన్న నటి, యాంకర్ అనసూయ. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ సినీ కెరీర్ కి రంగస్థలం సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. 

 

బుల్లి తెర మహారాణిగా వెలుగొందుతున్న అనసూయ టి వి షో లు, సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం అనసూయ కృష్ణ వంశి దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కి గాను భారీ ఆఫర్ ఒకటి అనసూయ ను వరించిందని సినీ వర్గాల కథనం. బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయమని ఆ షో నిర్వాహకులు అనసూయ ను సంప్రదించారని సమాచారం. అయితే ఇందుకు గాను భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారట. 

 

గతంలో బిగ్ బాస్ సీజన్ 3 కి యాంకర్ శ్రీ ముఖి కి కూడా ఎపిసోడ్ కి లక్ష చొప్పున ఇచ్చినట్టు నిర్వాహకులు చెపుతున్నారు. అందుకే అనసూయ క్రేజ్ కి తగ్గట్టు భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనసూయ మాత్రం దీనికి సున్నితంగా నో అని చెప్పిందని ప్రచారం. అన్ని రోజులు ఫ్యామిలి కి దూరంగా ఉండటం నా వల్ల కాదని, అయినా అంతకు ముందే ఒప్పుకున్నా టి వి షో లు, సినిమాలతో డేట్స్ ఖాళీగా లేవని అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరించిందని  ఇండస్ట్రీ టాక్. అయితే దీని గురించి అనసూయ కాని, బిగ్ బాస్ నిర్వాహకులు గాని ఏ విధమైన క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: