కరోనా ... యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రభావం మన దేశం మీదా బాగానే ఉంది. అయితే మన దగ్గర లాక్ డౌన్ చాలా వరకు అడ్డుకుంటున్నాము. కాని ఆర్ధికంగా మాత్రం అన్ని పరిశ్రమలకి కోలుకోలేని దెబ్బ పడింది. ఇక చిత్ర పరిశ్రమ అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటికే వందల కోట్లలో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయి నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా ఫైనాన్స్ తెచ్చిన నిర్మాతలకి ఇది భారీ దెబ్బ అని చెప్పాలి.

 

ఈ నేపథ్యంలో కొన్ని చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలని థియోటర్స్ కాకుండా నేరుగా ఓ.టీ.టీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేయాలని కొద్ది రోజులుగా అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆలోచన ముందుగా తెలుగు హీరోలు, మేకర్స్ కంటే తమిళ హీరో సూర్య చేశారు. తన భార్య నటించిన సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలన్న నిర్ణయం తీసుకొని అందుకు అగ్రిమెంట్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే అందుకు థియోటర్స్ అసోసియోషన్ మెంబర్స్ అండ్ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ దానిని ఖండించారు. 

 

ఇదే నిర్ణయం ఫైనల్ అనుకుంటే ఇక నుంచి సూర్య నిర్మించిన సినిమాలు గాని, సూర్య, కార్తీ ల సినిమాలని థియోటర్స్ లో రిలీజ్ చేయమంటు నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇది గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద వివాదంగా మారింది. అయితే ఇవన్ని లెక్క చేయకుండా ఎట్టకేలకు హీరో సూర్య తన పంతం నెగ్గించుకొని మే 29 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్న ఫస్ట్ తమిళ్ మూవీ ఇదే కావడం విశేషం. అయితే ఇది కోలీవుడ్ లో ఇంకా వివాదంగానే ఉంది. మరి తర్వాత సూర్య సినిమాలను రిలీజ్ చేస్తారా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. మరి ఈ స్టెప్ కరెక్ట్ గానే వేశాడా లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా అనేది తెలియడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: