సంక్రాంతి అంటేనే ప్రజలకు పెద్ద పండుగ. తెలుగు వారికి ఇష్టమైన వేడుక. ఇక సినీ జీవులకు కూడా సంక్రాంతికి చూస్తే పూనకం వచ్చేస్తుంది. టాలీవుడ్ హిస్టరీలో సంక్రాంతి హిట్ల లిస్ట్ చాలా పెద్దది. ప్రతీ హీరో ఏదో ఒక టైంలో తాము సంక్రాంతి హీరో కావాలనుకుంటాడు. సంక్రాంతి హిట్ కొడితే అదో త్రుప్తి. 

 

అటువంటి సంక్రాంతి  పండుగ 2021 లో రావడానికి ఏడాది టైం ఉందనగానే ఆర్.ఆర్.ఆర్ మూవీ కర్చీఫ్ పరచేసింది. తాము 2021 జనవరి 8న వస్తున్నామని చాలా ముందుగానే  చెప్పేసింది. ఇది పక్కా క్లారిటీ అని కూడా తేల్చేసింది. దాంతో మిగిలిన హీరోలంతా వెనక్కు తగ్గారు. ఆర్.ఆర్.ఆర్ మల్టీ స్టారర్ మూవీ. పైగా రాజమౌళి మూవీ. బాహుబలి తరువాత వస్తున్న పాన్ ఇండియా మూవీ

 

దాంతో ఇక మిగిలిన సినిమా హీరోలు నీరసపడ్డారు. నిజానికి మహేష్ బాబు 2020 సంక్రాంతి హిట్ కొట్టాడు. సరిలేరు నీకెవ్వరూ అనిపించుకున్నాడు. అదే ఊపుతో 2021 సంక్రాంతికి కూడా రావాలనుకున్నాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ అనౌన్స్మెంట్ తో మహేష్ సినిమా కూడా వస్తుందా అన్న డౌట్లు వచ్చాయి. అలాగే అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అన్నారు. ఆయనకు కూడా 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అల వైకుంఠపురంలో ఉంది.

 

ఇదే వరసలో బాలయ్య ఇతర హీరోలూ సంక్రాంతి బరిలోకి రావాలనుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఆశలన్నీ ఆవిరి చేసింది. అయితే ఇపుడు అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ మేకర్స్ నుంచి మరో అనౌన్స్మెంట్ తాజాగా వచ్చింది. సంక్రాంతికి టైం సరిపోదు కాబట్టి రాలేమని చెప్పేశారు. దాంతో ఇపుడు సంక్రాంతికి పెద్ద ఖాళీ వచ్చింది. ఆ స్లాట్ ఎవరిది అన్న చర్చ కూడా మొదలైంది. చిరంజీవి ఆచార్య ఇపుడు సంక్రాంతికి వచ్చెలా ఉంది. అలగే బాలయ్య బోయపాటి మూవీ కూడా సంక్రాంతి బరిలోకి రావచ్చునని అంటున్నారు.

 

మరి మహేష్ బాబు మూవీకి కరోనా, లాక్ డౌన్ కొంత దెబ్బగా ఉన్నాయి. స్పీడ్ గా అనిల్ రావి పూడిలా సినిమా ఆరు నెలల్లో తీసే డైరెక్టర్ అయితే మహేష్ కూడా రెడీయే. ఇక మరో హీరో బన్నీ పుష్ప సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి సమ్మర్ కి ఆర్.ఆర్.ఆర్ షిఫ్ట్ అవడంతో సంక్రాంతికి భారీ ఖాళీ వచ్చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: