మళయాళంలో మోహ‌న్‌లాల్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘లూసిఫ‌ర్’. ఈ సినిమాని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు. ‘సాహో’ తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా క్రేజ్ సంపాదించుకున్న సుజీత్‌ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా స్క్రిప్ట్ ని చిరంజీవి ఇమేజ్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు సుజీత్. 

 

విశ్వసనీయ వర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిందట. మ‌ల‌యాళంలో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ‘లూసిఫ‌ర్‌’ కథ చిరంజీవికి విపరీతంగా నచ్చడంతో ఒరిజిన‌ల్ ‘లూసిఫ‌ర్’ రీమేక్ హ‌క్కుల్ని రామ్‌చ‌ర‌ణ్ కొనుగోలు చేశాడు. కొన్నాళ్ళుగా ఈ సినిమాని త్రివిక్రం, వి వి  వినాయక్ లు తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగినప్పటికి చివరికి ఆ ఛాన్స్ యంగ్ దర్శకుడు సుజీత్ దక్కించుకొని అనుకున్న మార్పులు చేసి ఫైనల్ వర్షన్ మెగాస్టార్ కి, చరణ్ కి వినిపించడానికి సిద్దంగా ఉన్నాడట.

 

వెంకీమామ’ డైరెక్ట‌ర్ బాబీ చెప్పిన స్క్రిప్ట్‌కు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని త‌ప్ప‌కుండా ఆ స్క్రిప్టుతో సినిమా చేద్దామ‌ని బాబీకి మెగాస్టార్ మాట ఇచ్చారట. ఇదే విషయాన్ని చిరంజీవి చెప్పినప్పటికి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి కోరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీటయ్యాక బాబి తో చేస్తారా లేక లూసీఫర్ రీమేక్ తో సుజీత్ ని రంగం లోకి దింపుతారా అన్నది త్వరలో వెల్లడి కానుంది.

 

ఇక చిరంజీవి కోసం హరీష్ శంకర్, మెహర్ రమేష్ కూడా లైన్ లో ఉండగా ఇప్పుడు సంపత్ నంది కూడా వచ్చి చేరాడు. ఇక ఒకవైపు ఆచార్య, లూసీఫర్ రీమేక్ లను నిర్మించే వ్యవహారాలతో పాటు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. మరో హీరోగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తుండగా ఫిక్షన్ కథ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: