అస్సలు ఆలోచనకుకూడా అందని ప్రపంచం, ఊహించడానికి కూడా దూరంగా ఉన్న అద్బుతమైన సెట్స్, అదిరిపోయే యాక్షన్, అవాక్కయ్యే గ్రాఫిక్స్ , అన్నీ కలిపిఇతే అవతార్ సినిమా. అవతార్.. వరల్డ్ సినిమా హిస్టరీ లో  జేమ్స్ కామెరూన్ చూపించిన అమేజింగ్ మూవీ. అప్పట్లో సంచలనం సృష్టించిన అవతార్  సినిమాకి సీక్వెల్స్ రాబోతున్నాయి.

 

అవతార్ .. అదో విజువల్ వండర్. అంతకు ముందు వరకూ ఆడియన్స్ చూడని గ్రాఫికల్ వరల్డ్. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ తో ఆడియన్స్ కి అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు . ఈ సినిమాలో మనుషుల కన్నా  ఎత్తుగా విచిత్రంగా ఉన్న పాండోరా వాసుల్ని, పాండోరా దీవుల్ని పరిచయం చేశాడు కామెరూన్. దాదాపు 17వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 2009 లో రిలీజ్ అయిన అవతార్ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 2 లక్షల కోట్లు కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

 

2009 లో వచ్చిన అవతార్ సినిమాకి 10 సంవత్సరాల తర్వాత సీక్వెల్ స్టార్ట్ చేశాడు జేమ్స్ కామెరూన్.  అసలు ఫస్ట్ సినిమాలోనే అద్బుతమైన విజువల్స్ తో పాటు.. అసలు ఊహకు కూడా అందని గ్రాఫిక్స్ ని చూపించిన జేమ్స్ .. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పిక్స్ తో అవతార్  సీక్వెల్స్ లో   అంతకుమించి విజువల్ వండర్స్ ఉంటాయని హింట్ ఇచ్చి ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఇంకా పెంచేశాడు.  అంతేకాదు.. ఈ సినిమాలని ఎలా తెరకెక్కిస్తున్నాడో , ఎంత టెక్నికల్ సపోర్ట్ ని యూజ్ చేస్తున్నారో పిక్స్ రిలీజ్ చేశారు అవతార్ టీమ్.

 

అవతార్ లో చూపించిన అద్బుతమైన పాండోరా ని ఈ అవతార్ 2, 3 లో కంప్లీట్ గా కొత్తగా చూస్తారని అవతార్ అఫీషియల్ వెబ్ సైట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు అవతార్ 2 ని అండర్ వాటర్ లో డైరెక్ట్ చేస్తూ.. చూపిస్తున్న కామెరూన్ ఫోటోస్ ని రిలీజ్ చేసింది టీమ్. అవతార్ సీక్వెల్స్ లో జస్ట్ పాండోరా ని చూడడమే కాదు.. ప్రపంచం మొతత్తం చూస్తారనిచెబుతున్నాడు డైరెక్టర్ జేమ్స్. అవతార్ సినిమాలో నటించిన యాక్టర్స్  తో పాటు కేట్ విన్ స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రెన్ డన్ కవెల్ లాంటి టాప్ స్టారస్   ఈసీక్వెల్స్ లో  నటిస్తున్నారు. అందుకే  వచ్చే సంవత్సరం  డిసెంబర్ 17 నరిలీజ్ అయ్యే అవతార్ 2 సినిమాకు ఇప్పటినుంచే క్రేజ్ పెరిగిపోయింది. ఫస్ట్ సినిమా అంత హిట్ అయ్యింది కాబట్టే.. ఈసీక్వెల్ కి కూడా ఇంత క్రేజ్  పెరిగిపోయింది వరల్డ్ వైడ్ గా. 

మరింత సమాచారం తెలుసుకోండి: