సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండాలన్నా, ఫ్యాన్స్ కి నచ్చాలన్నా, ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అవ్వాలన్నా ..స్టార్ హీరోలకు తగిన గ్రాండియర్ ఉండాల్సిందే అంటున్నారు. అసలు సినిమా ఎలా ఉన్నా, క్లైమాక్స్ మాత్రం అదిరిపోవాలంటారు ఫ్యాన్స్ . అందుకే దానికి మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా తీస్తున్నారు మేకర్స్.

 

సినిమా మొత్తం ఎలా ఉన్నా..  క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటే .. ఆ సినిమా హిట్టే అంటారు పెద్దవాళ్లు . అందుకే మిగతా సినిమా ఎలా ఉన్నా.. క్లైమాక్స్ కోసం మాత్రం నిమిషానికి కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఫుల్ గ్రాండ్ గా తెరకెక్కిస్తారు . ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాకు కూడా క్లైమాక్స్ ఇలానే ప్లాన్ చేశారట. 6 నిమిషాల ఫైట్ కోసం ఏకంగా 6 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట సుక్కు అండ్ గ్యాంగ్ . బన్నీ యాక్షన్ ని గుర్తు చేసుకుని ఇప్పటి నుంచే ఎగ్జైట్ అయిపోతున్నారు అభిమానులు.

 

పుష్ప సినిమానేకాదు.. తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్  సినిమాకు కూడా క్లైమాక్స్ ఫైట్ కు దాదాపు 50 కోట్లకు పైగా  స్పెండ్ చేస్తున్నారన్న న్యూస్ బాగా వైరల్ అయ్యింది. ఇద్దరు స్టార్ హీరోల అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కి 15 నిమిషాల పాటు ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ క్లైమాక్స్  ఈ మద్య కాలంలో ఎక్కడా లేనంత ఇంపాక్టివ్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్.

 

ఇలాంటి ఇన్ క్రెడిబుల్ క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తున్న మరో సినిమా కెజిఎఫ్ 2. కెజిఎఫ్  ఫస్ట్ పార్ట్ లోనే హైలీ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్ చూపించిన డైరెక్టర్ ..ఈ సినిమాలో సంజయ్ దత్, యష్ మద్య అంతకుమించిన యాక్షన్ ఎలివేషన్ చూపించబోతున్నాడట. అందుకోసం దాదాపు  5 కోట్లకు పైగా స్పెండ్ చేశారట మేకర్స్.

 

తెలుగులో ఇంకా ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. బాలీవుడ్ లో ఇదే రేంజ్ క్లైమాక్స్ ప్లాన్ చేసేది సల్మాన్ ఖాన్. ఈ స్టార్ హీరో దబాంగ్‌ 3 కి కూడా దాదాపు 100 కు పైగా ఫైటర్లతో యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు . ఇప్పుడు ప్రభుదేవా తో చేస్తున్న  రాధే సినమాకు కూడా 8 కోట్లతో క్రోమా కీ టెక్నాలజీ తో పాటు విఎఫ్ఎక్స్ ని వాడి సల్మాన్- రణదీప్ హుడా మీద గ్రాండ్ గా సెట్ లోనే షూట్  చేశారు.  ఇలా సినిమా తో పాటు కాకుండా క్లైమాక్స్ కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇస్తూ.. నిమిషానికి కోట్లు ఖర్చుపెడుతున్నారు మేకర్స్ . మరి స్టార్ హీరోల సినిమాలకు ఆమాత్రం ఎలివేషన్ లేకపోతే  ఎలా అంటున్నారు ప్రొడ్యూసర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: