ఇన్నాళ్లు లవర్ బాయ్ ఇమేజ్ ని క్యారీ చేసిన ఈ క్యూట్ హీరో ఇప్పుడు కొత్తగా ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతున్నాడు. అంతేకాదు అంతకుమందెప్పుడూ చూపించని యాక్టింగ్ యాంగిల్స్ ని చూపింబోతున్నాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. నాగచైతన్య కెరీర్ లో రకరకాల క్యారెక్టర్లు చేశాడు. అయితే మేజర్ గా లవర్ బాయ్ ఇమేజ్ నే తెచ్చుకున్నాడు. మధ్యలో ఈ ఇమేజ్ ని బయటకు రావడానికి ఆటోనగర్ సూర్య, బెజవాడ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేశాడుకానీ .. అవి అస్సలు వర్కవుట్ అవ్వలేదు . అందుకే మళ్లీ రిస్క్ ఎందుకులే అని లవర్ బాయ్ ఇమేజ్ నే కంటిన్యూ చేస్తున్నాడు.

 

ఆ సో కాల్డ్ లవర్ బాయ్ ఇమేజ్ కెరీర్ కి  పెద్దగా మైలేజ్ ఇవ్వడం లేదు. అందుకే లాస్ట్ ఇయర్ ఎమోషనల్ గా మౌల్డ్ అయ్యి మజిలీ లో మంచి పర్ఫామెన్స్ ఉన్న రోల్ చేశాడు. నాగచైతన్య ఇలా కూడా చెయ్యగలడా అని అందరూ ఆశ్చర్యపోయేలా నటించి సినిమాని సూపర్ హిట్ చేశాడు నాగచైతన్య. అందుకే మజిలీ తన కెరీర్ లోనే స్పెషల్ మూవీ అని చెప్పాడు చైతూ.

 

మజిలీ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ టైటిల్ తో మరో ఇంట్రస్టింగ్  సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల అంటేనే  రియలిస్టిక్ గా పెద్దగా హంగామా, హడావిడి లేకుండా ఉంటాయి సినిమాలు. ఈ సినిమాలో కూడా చైతన్య అంతకుముందెప్పుడూ కనిపించని విధంగా సింపుల్ గా ఇంటెన్స్ ఎమోషన్స్ తో  పక్కింటి అబ్బాయిలా  కనిపిస్తున్నాడు.

 

లవ్ స్టోరీ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. నెక్ట్స్ సినిమా మీద ఇప్పుడు కసరత్తులు స్టార్ట్ చేస్తున్నాడు చైతన్య. అందుకే ఇప్పుడు చేస్తున్న సమ్ థింగ్ డిఫరెంట్ సినిమాల లానే మరో మూవీ చేద్దామనుకున్నాడు. అయితే ఈ సారి కంప్లీట్ గా జానర్ ఛేంజ్ చేసి మరీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో  చైతన్య చెయ్యబోయే సినిమా హార్రర్ మూవీగా ఉండబోతోందని టాలీవుడ్ లో న్యూస్  నడుస్తోంది. ఈ లైన్ ఓకే అయితే చైతన్య తన కెరీర్ లో చెయ్యబోతున్న ఫస్ట్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఇదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: