మొన్నటి  వరకూ జస్ట్ టాలీవుడ్ హీరో అయిన ప్రభాస్ ఇప్పుడు ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అదికూడా బాలీవుడ్ లో ఉన్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ని మించి పోయి  ఇమేజ్ సంపాదించుకున్నాడు. నిజంగా ప్రభాస్ బాలీవుడ్ స్టార్స్ కన్నా పెద్ద ప్యాన్ ఇండియా స్టారా..?


ప్రభాస్  అంటే ఒకప్పుడు సరిగా తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఇండియాలో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ . అంత క్రేజ్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ . అది కూడా ఒకే ఒక్క సినిమా బాహుబలితో . బాహుబలితో ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయాడు.  ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ వాళ్లు కూడా ప్రభాస్ ని ఫాలో అయ్యేంత క్రేజ్ సంపాదించుకున్నాడు.

 

ప్రభాస్ బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు , సల్మాన్ ఖాన్ , షారూఖ్, ఆమిర్  కన్నా పెద్ద స్టారే అంటున్నాడు  స్టార్ కెమెరా మెన్ సెంథిల్ . బాహుబలి సినిమాకి  డీఓపీ గా చేసిన సెంథిల్.. బాలీవుడ్ లో ఉన్న  ఖాన్ లు , కపూర్ ల కన్నా ప్రభాసే పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అంటున్నాడు .  ఎందుకంటే.. టాలీవుడ్ స్టార్ అయినా కూడా బాలీవుడ్  జనాలు మాత్రం ఫుల్ ఫిదా అయిపోయారు  ప్రభాస్ కి.

 

బాలీవుడ్ లో కూడా చాలా మందితో  సినిమాలు చేసిన సెంథిల్.. ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎప్పుడూ చూడలేదన్నాడు . ఏ స్టార్ హీరో కోసం ఇంతమంది రాలేదని, కానీ బాహుబలి షూటింగ్ టైమ్ లో ఊళ్లకు ఊళ్లు జనాలు ప్రభాస్ ని చూడడానికి వచ్చేవాళ్లని పబ్లిక్ గా చెప్పాడు సెంథిల్ . ఇంతలా ఏ బాలీవుడ్ హీరోకి ఇమేజ్ , క్రేజ్ లేదని .. అందుకే నిజమైన ప్యాన్ ఇండియ క్రేజ్ ప్రభాస్ కే ఉందంటున్నాడు.

 

ఇండియాలో ఇప్పటి వరకూ ఇంత క్రేజ్ ఉన్న స్టార్ ని చూడడం జరగలేదంటున్నాడు. ఎందుకంటే .. ఇప్పటివరకూ ఎంత మంది స్టార్ హీరోలున్నా ఇప్పటివరకూ ఏ హీరో వెయ్యికోట్ల కలెక్షన్లు సాధించలేదు . కానీ ప్రబాస్ టాలీవుడ్ స్టార్ అయ్యుండి.. ఇండియా వైడ్ గా ఇలాంటి కలెక్షన్లు సాధించిన హీరో వన్ అండ్ ఓన్లీ ప్రభాసే అంటున్నారు  సెంథిల్ తో పాటు అందరు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: