సావిత్రి... అక్కినేని... ఈ రెండు పేర్లు లేకుండా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవద్దు అనేది చాలా మంది మాట్లాడే మాట. వీరు ఇద్దరూ కూడా మన తెలుగు సినిమాను ఒక స్థాయిలో ఉంచారు అని చెప్తూ ఉంటారు బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళు. వీరు ఇద్దరూ కూడా తెలుగు సినిమా మీద తమ కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసారు అనేది చాలా మంది చెప్పే మాట. మన తెలుగులో వీరి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు ఒకరకంగా పండగా వాతావరణం ఉండేది అనేది అంటూ ఉంటారు. 

 

ఇక వీరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే వీరు ఇద్దరూ మంచి స్నేహితులు అని అంటారు. సావిత్రి జీవితంలో పడిన కష్టాలు అన్నీ కూడా అక్కినేని కి తెలుసు అని ఆయన ఆమెకు అండగా నిలబడే ప్రయత్నం చేసినా సరే కొన్ని శక్తులు ఆయన్ను అడ్డుకున్నాయి అంటూ ఉంటారు. సావిత్రి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సమయంలో ఆమెకు ఆయనే అండగా నిలబడే వారు అని అంటారు. సావిత్రి జీవితాన్ని చాలా దగ్గరగా చోసిన వ్యక్తి ఆయన అనేది చాలా మంది మహానటి సినిమా వచ్చిన సమయంలో చెప్పిన మాట. 

 

సావిత్రి మరణించిన తర్వాత ఆమెకు ఎంతగానో ఇష్టమైన మల్లె పూలను జల్లించారు అని అంటారు. ఇది ఎవరికి స్పష్టంగా తెలియదు గాని అప్పుడు అన్నీ దగ్గర ఉండి అక్కినేని స్వయంగా చూసుకునే వారు అని అంటారు. టాలీవుడ్ ఉన్నన్ని రోజు లు కూడా వీరు ఇద్దరూ ఉంటారు. వీరు ఇప్పుడు భూమి మీద లేకపోయినా సరే ఇండియన్ సినిమాను మాత్రం కచ్చితంగా ఇద్దరూ ప్రభావితం చేసారు అనేది చాలా మంది చెప్పే మాట. వీరు ఇద్దరినీ ఇంకా టాలీవుడ్ గౌరవిస్తూనే ఉంది అంటే వాళ్ళు చేసిన కృషి.

మరింత సమాచారం తెలుసుకోండి: