అలా ఎలా సినిమా ద్వారా తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైన భామ హెబ్బా పటేల్, కుమారి ౨౧ ఎఫ్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో తన గ్లామర్ తో పాటు ముద్దు సన్నివేశాల్లో నటించి కుర్రకారు మతి పోగొట్టింది. దాంతో హెబ్బాకి కుర్రాళ్ళలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఆ ఫాలోయింగ్ ఆమెకి విజయాల్ని తెచ్చి పెట్టలేకపోయాయి. కుమారి ౨౧ ఎఫ్ తర్వాత ఆమె హీరోయిన్ గా చేసిన చిత్రమేదీ చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు.

 

దాంతో చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడింది. నితిన్ హీరోగా వచ్చిన భీష్మ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హెబ్బా ఓ వ్యాంప్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి వరకూ హీరోయిన్ గా చూసిన హెబ్బాని అసలే మాత్రం ఇంపార్టెన్స్ రోల్ లో చూసేసరికి ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ సినిమాలో పాత్ర హీరోయిన్ గా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయినా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే అవకాశం తెచ్చిపెట్టింది.

 

ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఒక ప్రత్యేక పాటలో రామ్ తో స్టెప్పులేసింది. గ్లామర్ ఒలకబోయడానికి సిద్ధంగా ఉండే హెబ్బా ఐటెం సాంగ్ లో స్టెప్పులేస్తుందంటే ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నిన్న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఐటెం సాంగ్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు.

 

డించక్ అనే ఈ పాటలో హెబ్బా ఏమంత గ్రేస్ గా, గ్లామర్ గా కనిపించలేదు. ముఖ్యంగా ఆమె వేసుకున్న డ్రెస్సు, వేసిన స్టెప్పులు అంత బాగాలేవని టాక్ వచ్చింది. ఒక పాటలో హీరోయిన్ బాగా కనిపించకపోవడానికి చాలా మంది కారణం అయి ఉంటారు. ఎవ్వరు కారణమైనా మనం చూసేది హీరోయిన్నే కాబట్టి బాలేదన్న పేరు కూడా హీరోయిన్ కే వస్తుంది. గ్లింప్స్ వీడియోలో ఆకట్టుకోకపోయినా సినిమాలో ఫుల్ సాంగ్ తో మురిపిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: