దాసరి నారాయణ రావు... ఈయన పేరు వింటే చాలా మందికి ఇప్పటికి కూడా ఒకరకమైన ఊపు అనేది వస్తుంది. కెరీర్ లో ఏ దర్శకుడు ఏ నిర్మాత సాధించలేరు అనుకునే విజయాలను ఆయన సాధించి చూపించారు. ప్రతీ సినిమా కూడా ఆయన తీసుకొచ్చిన సినిమా ఒక స్థాయిలో విజయం సాధించిన సినిమాలే అనేది వాస్తవం. అయితే ఆయన కెరీర్ లో ఎవరిని నమ్మే వారు కాదు గాని మోహన్ బాబు ని మాత్రం ముందు నుంచి చాలా బాగా నమ్మే వారు అని అంటారు. మోహన్ బాబు నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే కచ్చితంగా ఆయన అందించిన ప్రోత్సాహమే అనేది చాలా మంది చెప్పే మాట. 

 

ప్రతీ సందర్భంలో కూడా మోహన్ బాబు కి దాసరి తన వంతుగా సహాయ సహకారాలు అందించారు అని అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇది మాత్రం చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక మోహన్ బాబు అయితే దాసరి ని గురువు గారు అని చెప్తూ ఉంటారు. మోహన్ బాబు మాట్లాడితే కచ్చితంగా దాసరి ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగం ఉండదు. ఆ విధంగా దాసరి కి మోహన్ బాబు చాలా దగ్గరయ్యారు అనేది వాస్తవ౦. నేడు మోహన్ బాబు ఈ స్థాయిలో పేరు సంపాదించారు అంటే కచ్చితంగా ఆయన నుంచి వచ్చిన సహకారం ఆయన తో చేసిన సినిమాలే. 

 

అందుకే మోహన్ బాబు చివరి వరకు దాసరి కి అండగా నిలబడ్డారు అని అంటారు. ప్రతీ అంశం లో మోహన్ బాబు ని చాలా దగ్గరి వ్యక్తిగా దాసరి చూసిన సందర్భాలు ఉన్నాయి అనేది మన తెలుగులో వినపడే మాట. అందుకే నేడు వీరి స్నేహం గురించి కొందరు మాట్లాడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: