మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయన ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. చెన్నైల టీ నగర్ లోని విజయ రాఘవ చారి రోడ్డు లోని ఓ అద్దె ఇంట్లో హాస్య నటుడు సుధాకర్, హరి ప్రసాద్ తో కలిసి నెలకి ముప్పై మూడు రూపాయలు రెంట్ కట్టేవాడు. తన నాన్న నెలకి 150 రూపాయలు ఇస్తే... అందులో 33 రూపాయలు పోగా మిగతా 117 రూపాయలను నెల వరకు చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు. హరి ప్రసాద్ కి డబ్బులిచ్చి కూరగాయలు తెప్పించేవారు. తెచ్చిన కూరగాయలతో చిరంజీవి, సుధాకర్ కలసి అన్నం కూర చేసేవారు.


హరి ప్రసాద్ కాయగూరల కోసమని ఇచ్చిన డబ్బులతో ఏం చక్కా టిఫిన్ చేసి... రూమ్ కి తిరిగి వచ్చి డబ్బులు పోయాయి అని చెప్పేవాడు. ప్రతిరోజు ఇలానే చేస్తుండడంతో... ఒకరోజు సుధాకర్ చిరంజీవి కలిసి అతన్ని ఫాలో అయ్యి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత సుధాకర్ కూరగాయల కోసం వెళ్లడం ప్రారంభించాడు. కూరగాయలకు డబ్బులు ఖర్చుచేయడం ఇష్టంలేక ఒక ఇంట్లో ములక్కాడలను దొంగలించేవాడు. ఒకానొక రోజు ములక్కాడల ఇంటాయన సుధాకర్ ని పట్టుకొని పెద్ద గొడవ చేయగా చిరంజీవి వచ్చి పరిస్థితిని సద్దుమణిగించాడు.


ఒకానొక రోజు సీతాకోకచిలుక సినిమాని తెరకెక్కించిన దర్శకుడు భారతీరాజా సుధాకర్ ని పాండీ బజార్లో చూసి తను తీయబోయే కిళెక్కే పోగుం రైలు (1978) అనే సినిమాలో ఓ పాత్రలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సమయంలోనే గూడపాటి రాజ్‌కుమార్ కూడా సుధాకర్ ని పిలిచి తను తీసే పునాదిరాళ్ళు సినిమాలో ఓ పాత్రలో నటించమని అవకాశం ఇచ్చాడు. అయితే రెండు సినిమాల చిత్రీకరణ షెడ్యూల్స్ ఒకే టైంలో అవ్వడంతో... సుధాకర్ చిరంజీవిని వెంటబెట్టుకొని పునాదిరాళ్లు కార్యాలయానికి వెళ్లి గూడపాటి రాజ్‌కుమార్ ని కలిసి నాకు తమిళంలో కూడా ఒక సినిమా అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ చిత్రం యొక్క షూటింగులు ఒకేసారి జరగనున్నాయి.


రెండిటిలో ఒకేసారి నటించడం నాకు కుదరని పని. మీరు ఏదైనా సలహా ఇవ్వండి' అని చెప్పగా... ఇంత షాక్ ఇచ్చావేంటయ్యా బాబు అంటూ తర్జనభర్జన పడిపోయిన సదరు దర్శకుడు చిరంజీవి వైపు చూస్తూ... ఈ కుర్రాడు ఎవరు అని ప్రశ్నించాడు. తను నా రూం మెట్. పేరు శివ శంకర వర ప్రసాద్' అని చెప్పాడు. దాంతో గూడపాటి రాజ్‌కుమార్ మాట్లాడుతూ... సుధాకర్, నువ్వు తమిళ సినిమాలో చేసుకో. చిరంజీవి ని నా సినిమాలో పెట్టుకుంటాను' అని చెప్పాడు. దానికే సంతోషంగా అంగీకరించిన సుధాకర్సినిమా నుండి తప్పుకొని చిరంజీవి కి మొదటి అవకాశం కల్పించాడు. ఆ విధంగా చిరంజీవి తన మొట్టమొదటి అవకాశాన్ని చేజిక్కించుకుని తన సత్తా చాటాడు. శివ శంకర వర ప్రసాద్ చిరంజీవి అవ్వకముందే సుధాకర్ చిరుల మధ్య గట్టి స్నేహబంధం కొనసాగేది. కాగా, అప్పట్లో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని కుర్ర హీరో గా సుధాకర్ కొనసాగాడు కానీ కొంతమంది కారణంగా తనకి అక్కడ అవకాశాలు సన్నగిల్లి పోగా తెలుగు ఇండస్ట్రీ అడుగుపెట్టి కమెడియన్ గా ఎదిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: