టాలీవుడ్ లో కుటుంబాల పరంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే తమకు తాము గా పైకి వచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తులు రామ్ చరణ్ రానా. వీరి ఇద్దరికీ బ్యాక్ గ్రౌండ్ చాలా బలంగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం తన సొంత శక్తిని నమ్ముకుని సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు గాని తండ్రి నుంచో తాత నుంచో పైకి రావాలని ఏ రోజు భావించలేదు అనేది వాస్తవం. ఇక ఈ ఇద్దరి హీరోల వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మాత్రం ఇద్దరూ కూడా మంచి స్నేహితులు అనేది అందరికి తెలిసిన విషయమే చెన్నై లో చిన్నప్పుడు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చినా సరే ఇద్దరూ అలాగే ఉన్నారు. 

 

ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఒకరికి ఒకరు అండగా ఉండటం వంటివి మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం. ఇద్దరూ కూడా ఎక్కడా తాము ఒంటరి కాదని పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పే వారు. ఇక కుటుంబాల మధ్య ఏది ఉన్నా సరే వీరు ఇద్దరు మాత్రం ఒకరికి ఒకరు చాలా దగ్గరగా ఉంటారు. రామానాయుడు మరణించిన సమయంలో రానా కు ఎక్కువగా అండగా ఉన్నదీ కచ్చితంగా  రామ్ చరణ్ ఒక్కరే అనే విషయం అందరికి తెలిసిందే. రామ్ చరణ్ ఇంటికి వెళ్ళడం అక్కడి నుంచి ర్రానా తో మాట్లాడటం అన్నీ జరిగాయి. 

 

ఇక రానాను రామ్ చరణ్ ఆ సందర్భంలో హత్తుకున్న  ఫోటో ఇప్పటికి సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటుంది అనేది వాస్తవం. ఇద్దరూ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరి కెరీర్ పీక్ దశలో ఉంది. రానా వరుసగా సినిమాలు చేయకుండా చాలా జాగ్రత్తగా గా సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్ కూడా అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: