సినిమాల్లో నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో కోడెల శివప్రసాద్. వీరు ఇద్దరూ రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని చూడని విజయాలు లేవు సాధించిన ఘనతలు లేవు అనేది అందరికి తెలిసిన విషయమే. రాజకీయాల్లో వీళ్ళు ఇద్దరూ కూడా ప్రభావం చూపించారు. వీరు ఇద్దరికీ కూడా తెలుగు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. అయితే వీరు ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అనేది చాలా మందికి తెలియదు. కోడెల మంచి వైద్యులు. బసవతారకం ఆస్పత్రి బాలకృష్ణ కట్టిన సమయంలో ఆ ఆస్పత్రికి అన్ని విధాలుగా కోడెల సహకరించారు అని అంటారు. 

 

అందుకే బసవతారకం ఆస్పత్రికి కోడెల ను బాలకృష్ణ చైర్మన్ గా కూడా చేసారు అని చెప్తూ ఉంటారు. కోడెల కోసం ప్రత్యేకంగా బాలకృష్ణ ఒక ఛాంబర్ ని కూడా ఉంచారు అని అంటూ ఉంటారు. కోడెల వస్తున్నారు అంటే ఆస్పత్రి సిబ్బంది కూడా బాలకృష్ణ కు ఏ స్థాయిలో గౌరవ మర్యాదలు ఇచ్చే వారో అదే స్థాయిలో కోడెల కు కూడా ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటూ ఉంటారు. బాలకృష్ణ తన జీవితంలో ఎక్కువగా నమ్మిన వ్యక్తి కోడెల శివప్రసాద్ అని అంటారు చాలా మంది. అందుకే ఆయన మరణించిన సమయంలో అన్నీ బాలకృష్ణ దగ్గర ఉండి చూసారు. 

 

బాలకృష్ణే స్వయంగా అన్నీ తానై నిలబడి బాలకృష్ణ లేకుండా ఏది జరగలేదు అనే విధంగా అక్కడ నిలబడ్డారు. అంతిమ యాత్రలో సినిమా షూటింగ్ ఉన్నా సరే బాలకృష్ణ వచ్చి పాల్గొని చివరి వరకు ఉన్నారు. కోడెల కుటుంబానికి ఆయన తన వంతుగా ధైర్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికి కోడెల కుటుంబం తో బాలకృష్ణ మాట్లాడటమే కాదు వారి యోగ క్షేమాలను ఆర్ధిక పరిస్థితిని అడుగుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: