స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్న‌ కవిత విన్నప్పుడల్లా స్నేహం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. భరించలేని కష్టం బాధపెట్టినా.. నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిజమైన స్నేహం జీవితాంతం మ‌న‌తోనే ఉంటుంది. అందుకే స్నేహమనేది వెలకట్టలేనిద‌ని అంటారు. ఇక సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఎంద‌రో గొప్ప స్పేహితులు ఉన్నారు.

 

అలాంటి వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ముందుంటారు. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య ఎలాంటి స్నేహం ఉంటుందో మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోనవసరం లేదు. వారిద్దరి ఆలోచనలు, అభిరుచులు అన్ని కూడా ఒకేలా ఉంటాయని చాలా మంది అంటారు. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా కోసం పనిచేసారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఓ మోస్త‌రుగా ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్‌గా నిలిచింది.

 

కానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ గురించి మాట్లాడుకునేటప్పుడు వారి సినిమాల‌ గురించి కంటే వారి స్నేహం గురించే చాలా మంది మాట్లాడుకుంటారు. అందుకే పవన్, త్రివిక్రమ్ మధ్య ఉన్న బాండింగ్ తెలుగు చిత్రసీమలో మరే ఇద్దరి మధ్య లేదని అంటుంటారు. వాస్త‌వానికి ఇగోలు ఎక్కువగా ఉండే ఇండస్ట్రీలో అన్ని సంవత్సరాలు నిలిచే స్నేహాలు చాలా తక్కువ. అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దాదాపుగా కృష్ణార్జున‌లు అన‌డంలో సందేహం లేదు. ఇక సినిమాలు హిట్ అయినా.. ఫ‌ట్ అయినా.. మా స్నేహం శాశ్వ‌తం అని వీరిద్ద‌రూ ఎప్పుడూ నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: