త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే చాల అమందికి ఒక ఆసక్తి అనేది ఉంటుంది. వీరి కాంబినేషన్ లో సినిమా కోసం ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు చాలా మంచి విజయాలు నమోదు చేసాయి. వీరి ఇద్దరూ కూడా ముందు నుంచి చాలా మంచి స్నేహితులు అని అంటూ  ఉంటారు టాలీవుడ్ జనం. వీరు ఇద్దరూ కూడా కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారని అప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు అని చెప్తూ ఉంటారు. 

 

ప్రధానంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి చాలా బాగా సహాయం చేసారు అని చెప్తూ ఉంటారు. జల్సా సినిమాకు ముందు వీరు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు అని కాని అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇద్దరూ ఒక కసి తో పని చేసి పైకి వచ్చారు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే త్రివిక్రమ్ కి ఆ గౌరవమే ఎక్కువగా ఉందని అందుకే మెగా ఫ్యామిలీ కి ఆయన ఆ స్థాయిలో దగ్గరయ్యారు అని అంటూ ఉంటారు. మెగా ఫ్యామిలీ కూడా ఆయనకు చాలా గౌరవం ఇస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా తీసుకుని రావాలి అనేది కూడా త్రివిక్రమ్ ఆలోచన గా చెప్తూ ఉంటారు. 

 

ఇక వీరి వ్యక్తిగత జీవితం అయినా సినిమాలు అయినా సరే ఎవరు ఎన్ని అనుకున్నా ఏది చేసినా ఏది రాసిన సరే ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు గాని ఒకరికి ఒకరు ఏ రోజు దూరంగా లేరు అని చెప్తూ ఉంటారు. ప్రతీ విషయాన్ని కుటుంబ పరంగా ఇప్పటికి పదే పదే చెప్పుకుంటూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: