తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువగా ఉన్నారనేది నిజం. అయితే తెలుగు హీరోయిన్లే తక్కువగా ఉన్నారా లేదా వారికి అవకాశాలు తక్కువగా వస్తున్నాయా అన్నది ఎప్పటికీ తేలని అంశం. ఇకపోతే అచ్చమైన తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బ గురించి అందరికీ తెలిసిందే. ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన ఈ భామకి విజయాలు తక్కువే.

 


అవకాశాలు బాగానే వస్తున్నా ఒక్క చెప్పుకోదగ్గ చిత్రం కూడా లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకుముందు ఆ తర్వాత సినిమా తర్వాత మళ్ళీ ఇంద్రగంటి చిత్రమైన అమీతుమీ సినిమాతో గుర్తింపు వచ్చింది. అయితే అది కూడా ఆమెకి స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అందం, అభినయం రెండూ ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు రావో అర్థం కాని పరిస్థితి.

 

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేతలో ఒకానొక చిన్న పాత్రలో ఈషా కనిపించింది. త్రివిక్రమ్ సినిమాలో అవకాశం అంటే ఆమె పాత్రకి మంచి ఇంపార్టెన్సే ఉందని అనుకున్నారంతా.. కానీ చాలా నిడివి ఉన్న పాత్రే కాకుండా, అంతగా ప్రాధ్యాన్యం లేదని సినిమా చూశాక అర్థం అయింది. అయితే ఆ సినిమా ద్వారా ఆమెకి ఎంత లాభం వచ్చిందన్న సంగతి పక్కన పెడితే, అరవింద సమేతలో ఎన్టీఆర్ ని బుల్లెట్ మీద ఎక్కించుకుని వెళ్లే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్ ని ఈషా గుర్తుచేసుకుంది.

 

ఆ సీన్ కి ముందు బుల్లెట్ డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పటి జ్ఞాపకాలని మరోసారి గుర్తు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించింది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: