పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాడుతున్నాడు. పార్టీని ముందుకు నడిపించేందుకు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మళ్ళీ తన మొహానికి రంగు పూసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తొలిప్రేమ లాంటి అద్భుతమైన రొమాంటిక్ చిత్రం తీసిన అప్పటి పవన్ కళ్యాణ్ క్రేజ్, రాజకీయంలో ఘోరంగా ఓడిపోయిన ఇప్పటి పవన్ కళ్యాణ్ క్రేజ్ అలానే ఉందంటే అతిశయోక్తి కాదు. 8 సంవత్సరాల గబ్బర్ సింగ్ హిస్టీరియా అంటూ మొన్న లక్షల్లో పవన్ అభిమానులు నెట్టింట చేసిన రచ్చ దీనికి నిదర్శనం. తన అభిమానుల కోసం ఈ ఆర్టికల్ ద్వారా కొన్ని షాకింగ్ నిజాలు చెప్పబోతున్నాం.


1. పవన్ కళ్యాణ్ పైకి చూడడానికి చాలా అమాయకుడిగా ఏమీ తెలియని వాడిలా కనిపిస్తాడు కానీ తనలో భీభత్సమైన సెన్స్ అఫ్ హ్యూమర్ ఉంది.


2. పవన్ కళ్యాణ్ సినిమాల్లోని చాలా పాటలు రేణుదేశాయ్ పవన్ కలిసి ఎడిట్ చేశారు.


3. చిన్నతనంలో పవన్ కళ్యాణ్ కు దెయ్యాలంటే చచ్చేంత భయం. అందుకే చిరంజీవి ప్రతిరోజు రాత్రి హనుమాన్ చాలీసా, హనుమాన్ కథలు పవన్ కళ్యాణ్ కి చదివి వినిపించేవాడు.

4. పవన్ కళ్యాణ్ కి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన ప్రకృతి లో మునిగిపోయి ప్రకృతి తో మాట్లాడుతూ ఉంటాడు.

5. గతంలో పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ సినిమాల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఎంతో నష్ట పోయారు. అందుకే వారి నష్టాలను పూడ్చేందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్నాడు. లేకపోతే రాజకీయాల్లోనే తన జీవితాన్ని పూర్తిగా అర్పించే వాడు.

6. చిన్నతనంలో పవన్ కళ్యాణ్ మావోయిస్టు లేదా నక్సలైట్ల లో కలవాలని అనుకున్నాడట.

7. ఆనంద సాయి అనే ఆర్ట్ డైరెక్టర్ తో కలసి ఇంట్లో నుండి పారిపోవాలని పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్లాన్ వేసుకున్నాడట.

8. హార్వర్డ్ యూనివర్సిటీ లో మాట్లాడిన మొట్టమొదటి తెలుగు యాక్టర్ గా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: