లాక్ డౌన్ అయిపోయాకైనా థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం  పర్మిషన్ ఇస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ నిర్మాతలకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ షాక్ ఇచ్చారు. థియేటర్ల విషయంలో  ప్రభుత్వం ఎలాంటి సాయం చేసే పరిస్థితి లేదని మరో రెండు లేదా మూడు నెలల వరకు సినిమా హాళ్ల ఓపెన్ కు అనుమతి లభించకపోవచ్చని తలసాని అన్నారు అలాగే షూటింగ్ ల విషయం లోకూడా ఎలాంటి సాయం చేయలేమని మరి కొన్ని రోజులు షూటింగ్ లను అనుమతించమని ఆయన తెలిపారు. ఈన్యూస్ తో టాలీవుడ్ షాక్ తింది. ఇప్పటికే విడుదలకావల్సిన సినిమాలు ల్యాబ్ లకే పరిమితమయ్యాయి మరో వైపు అటు షూటింగ్ లు లేక సినీ కార్మికులు ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వారిని మరింత కష్టాల్లోకి నెట్టనుంది. 
 
అయితే ఈపరిస్థితితులను క్యాష్ చేసుకోవాడానికి ఓటిటి సంస్థలు రెడీగా వున్నాయి. ఇటీవల పలు తెలుగు సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి  అమెజాన్ ప్రైమ్ ,నెట్ ఫ్లిక్స్ సంస్థలు ముందుకొచ్చాయి అయితే ఆయా సినిమాల నిర్మాతలు మాత్రం ఆసక్తి చూపించలేదు కానీ తాజాగా మంత్రి తలసాని ఇచ్చిన  స్టేట్ మెంట్ తో నిర్మాతలు మనసు మార్చుకోని  డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్దమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
 
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో  విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలను కొని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. తెలుగులో మాత్రం ఇప్పటివరకు అమృతారామమ్ అనే చిన్న సినిమా మాత్రమే ఒక్కటే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యింది అయితే రానున్న రోజుల్లో టాలీవుడ్ లో మరికొన్ని చిన్న సినిమాలతోపాటు పెద్ద సినిమాలు కూడా  థియేటర్ రిలీజ్ లేకుండా  డైరెక్ట్ గా ఓటిటి లోకి రానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: