మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎంతగా సమయం కేటాయించడానికి ఇష్టపడతాడో మనందరికీ తెలుసు. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే గడుపుతుంటాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని వారితో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం చరణ్ కి లభించింది. దీంతో లాక్ డౌన్ సమయాన్ని ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. అమ్మ నాన్నమ్మ దగ్గర వెన్న చిలకడం నేర్చుకుంటున్నాడు.. ఇంటి పనుల్లో వారికి సహాయం చేస్తూ రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కరోనా నివారణకు అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. తాజాగా తన 'ధృవ' సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ''ధృవ సినిమా సెట్స్ లోని త్రో బ్యాక్ పిక్స్ ఇవి. సెట్స్‌ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి'' అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. దీని బట్టి చూస్తే చరణ్ షూటింగ్ కోసం ఎంతో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని అర్థం అవుతోంది. 

 

 

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలో చరణ్ సాలిడ్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చరణ్ సిక్స్ ఫ్యాక్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. అంతేకాకుండా 'ఆచార్య' సినిమాలో కూడా కీలక పాత్రలో నటించనున్నాడు చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: