బాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఎవరూ చూసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. అవునా.. ఎంట్రీ ఇస్తున్నాడా.. అనే విషయాన్నే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో మరో స్టార్ కిడ్ ఎంట్రీ గురించి చర్చలు మొదలయ్యాయి. పటౌడీ కాందాన్ నుంచి మరో కథానాయకుడు తెరంగేట్రం  చేస్తున్నాడే  ప్రచారం యమా జోరుగా జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ సినిమాల్లోకి వస్తున్నాడనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. 

 

ముంబయిలో సోషల్ మీడియా నుంచి మొదలుపెడితే.. బీటౌన్ వరకు ఎక్కడ చూసినా.. ఇబ్రహీం అలీఖాన్ గురించే ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ కు యంగర్ వెర్షన్ లా కనిపిస్తోన్న ఇబ్రహీం సినిమాల్లోకి వస్తున్నాడనీ.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ క్రేజీ లవ్ స్టోరీస్ రెడీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే లాక్ డౌన్ సమస్యల కంటే ఎక్కువైపోయిన ఈ ప్రచారానికి ఫుల్ స్టార్ పెట్టే ప్రయత్నం చేసింది సైఫ్ తనయ సారా అలీఖాన్. 

 

కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించడంతో లాక్ డౌన్ ఎపుడైతే విధించారో  అప్పటి నుంచి చాలా మంది సోషల్ మీడియాకు అతుక్కుపోయారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు సైతం అందులోని కొత్త విషయాలను అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా చాలా సామాజిక మాధ్యమంలో యాక్టివ్ అయిపోయాడు. తన సహోదరి సారా అలీఖాన్ తో కలిసి టిక్ టాక్ లు, ప్రాంకులు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక తండ్రి సైఫ్ అలీఖాన్ కు కార్బన్ కాపీలా ఉన్న ఇబ్రహీంని చూసిన జనాలు హీరో.. నెక్స్ట్ సూపర్ స్టార్ అని కామెంట్ చేస్తున్నారు.

 

సారా అలీఖా రీసెంట్ గా ఓ మీడియా హౌస్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటరాక్షన్ లో తమ్ముడి లాంచింగ్ పై మాట్లాడింది సారా. ఇబ్రహీం ఇంకా గ్రాడ్యుయేషన్ కోర్స్ స్టార్ట్ చేయలేదు. అయినా డిగ్రీ పూర్తవ్వకుండా సినిమాలేంటి.. తమ్ముడు లాస్ ఏంజిల్స్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయబోతున్నాడు. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు యాక్టింగ్ గురించి ఆలోచిస్తాడని చెప్పింది సారా.  

 

సారా అలీఖాన్ స్పష్టత ఇవ్వడంతో ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. సైఫ్ అలీఖాన్ పుత్రం మూవీ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని బాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనే గనుక త్వరలో ఎంట్రీ ఇస్తే.. ఓ మంచి హీరోను బాలీవుడ్ దక్కించుకున్నట్టు అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: