అవును, అక్కడికి కూడా వినోదం కోసం వెళతారు కదా. విందు పేరిట రిఫ్రెష్ ‍మెంట్స్ ఎటూ ఉంటాయి. ఇక మందు కూడా జత చేరిస్తే తప్పేంటి, జనం విరగబడివస్తారు. ఈ లెక్క ఏదో బాగుంది కదా. సినిమా హాళ్ళు ఈసురోమంటూ జనాలు లేకుండా ఖాళీగా పడి ఉంటున్నాయి. అక్కడ చిన్న సైజు మందు షాప్ ఓపెన్ చేస్తే కాఫీ తాగినట్లే అది కావాల్సిన వారు దాన్ని తాగుతారు కదా.

 

ఈ ఆలోచన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కి వచ్చింది. ఆయన బడా డైరెక్టర్ల జాబితాలో చేరిపోతున్నాడు. ఆయన మహానటితో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్ వాల్యూని పెంచడమే కాదు. మళ్ళీ జనంలోకి తెచ్చి సక్సెస్ ట్రాక్ పట్టించాడు. ఇపుడు రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా మూవీనే తీయాలని కూడా డిసైడ్ అయ్యాడు. 

 

ఈ నేపధ్యంలో లాక్ డౌన్ వచ్చేసింది. కరోనా వైరస్ భయం ఉండనే ఉంది. అయితే సినిమాలు రిలీజ్ కావాలంటే ధియేటర్లు కావాలి. మరి ధియేటర్లకు అనుమతులు వస్తాయా అన్నది పెద్ద డౌట్. ఒకవేళ ఇచ్చినా కూడా సినిమాలు చూసేందుకు జనం వస్తారా అన్నది మరో పెద్ద ప్రశ్న. దీంతో సినిమాలకు తిరిగి జనాలను ఎలా రప్పించాలన్నది పెద్ద చర్చగా ఉంది.

 

దానికి ఎవరు తోచిన ఆలోచనలు వారు చేస్తున్నారు. మరి నాగ్ అశ్విన్ తన సలహా తాను ఇస్తున్నాడు. ఇది భలే సలహా అని కూడా అంతా అంటున్నారు. ఈ మధ్యన లాక్ డౌన్ సడలింపులో మద్యం అమ్మకాలకు పోటెత్తిన జనాలకు చూసిన వారికి కరోనా భయం వారిలో ఎక్కడా కనిపించలేదు. అంటే కరోనా భయం కంటే మందు ప్రియం అన్నది అందరికీ తెలిసిపోయింది.

 

ఇపుడు ఆ మందునే ఏకంగా సినిమా హాళ్ళకు తీసుకువస్తే జనం కూడా అలా తోసుకుంటూ హాళ్లకు వస్తారని నాగ్ అశ్విన్ ఒక సలహా ఇచ్చేశారు. ఇది బాగానే ఉన్నా ఇప్పటికే సినిమా హాళ్లకు తాగి వచ్చి అల్లరి చేసే బ్యాచులను అంతా చూశారు. ఇపుడు అక్కడే మందు ఉంటే ఇక మందుబాబులతో కలసి ఆడియన్స్ సినిమా చూసినట్లేనని అంటున్నారు. మొత్తానికి సినిమాను పట్టాలెక్కించడానికి కూడా మందే మందు అంటున్న నాగ్ అశ్విన్ ఆలోచన అమల్లోకి తేగలరా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: