హీరో నిఖిల్ సిద్ధార్థ్ వివాహం పల్లవి వర్మతో గురువారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. లాక్‌ డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌ లో జరిగింది. అయితే నిఖిల్ ఈ మధ్య తన పెళ్లి గురించి తెలుపుతూ.. అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని, అది ఎప్పుడు వీలైతే అప్పుడే అని తెలిపాడు. పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా తెలిపిన నిఖిల్ సడెన్‌గా నిర్ణయం తీసుకుని.. పెళ్లి తంతు పూర్తి చేశాడు. ఇక నిఖిల్ పెళ్లి అయ్యింది ఇప్పుడందరి చూపు మరో యంగ్ హీరో నితిన్‌పై పడింది. నితిన్ కూడా తన గర్ల్‌ ఫ్రెండ్ షాలినీ ని పెళ్లి చేసుకోవాలని అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత.. కరోనా మహమ్మారి వచ్చి వారి పెళ్లిని వాయిదా వేసింది. కానీ ముహూర్తాలు లేవని కామ్‌ గా నిఖిల్ పెళ్లి చేసేసుకున్నట్లుగా ఇప్పుడు నితిన్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా.. శాలినీతో పెళ్లి అంటూ నితిన్ కూడా సడెన్‌ గా సర్‌ప్రైజ్ చేయనున్నాడా.. అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

 

వాస్తవానికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ - షాలిని జంట దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ క‌రోనా దెబ్బతో ప్లాన్ అంతా తారుమారైంది. కరోనా డేస్ లో పెళ్లి చేసుకొనే ఆలోచన విరమించుకొని వాయిదా వేసుకున్నారు. నిఖిల్ పెళ్లి జరిగిపోవడంతో నితిన్ పెళ్ళెప్పుడు అంటూ అందరూ ఆలోచిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నితిన్ త‌న వివాహాన్ని డిసెంబ‌ర్‌ కు వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. ఈ ఏడాది చివరికి కరోనా కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉందని.. అందరూ పెళ్ళికి వస్తారని డిసెంబర్ లో అనుకుంటున్నారట. కాగా దగ్గుబాటి రానా వివాహం కూడా డిసెంబ‌ర్‌ లో జ‌ర‌పాల‌నుకుంటున్నట్లు సురేష్‌ బాబు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. మొత్తం మీద టాలీవుడ్ బ్యాచిలర్స్ అందరూ ఇంటివాళ్ళు కాబోతున్నారన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: