కొన్ని సంవత్సరాల క్రితం ఇన్ని కేబుల్ కనెక్షన్స్, ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు. అప్పట్లో సందుకోక టీవీ ఉంటే వారు బాగా డబ్బు ఉన్న వారు అనుకొనే వారు. ఇదంతా అప్పుడు కాలం, కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచం మొత్తాన్ని చూడగలుగుతున్నాం అది వేరే విషయం అనుకోండి. ఇకపోతే ఇంతక ముందు కాలంలో దూరదర్శన్ లో ప్రసారమయ్యే  మహాభారత్, రామాయణ్ గుర్తుకు ఉన్నాయా ..? ఎందుకు ఉండవు...? ఉంటాయి, దీనికి కారణం అప్పట్లో పెద్దగా ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకపోవడమే.

 

ఇకపోతే రామాయణ్, మహాభారత్ సీరియల్స్ ను మనం టెలివిజన్ చరిత్రలోనే ఎవరూ మర్చిపోరు. నిజానికి ఇవి అప్పట్లో ఒక ఊపు ఊపిన సీరియల్స్. ఇకపోతే తాజాగా లాక్ డౌన్ వల్ల ఈ రెండు సీరియల్లను ఇటీవల పునప్రసారం చేశారు. ఇకపోతే రెండు రోజుల క్రితమే వాటి ప్రసారం కూడా ముగిసింది. ఇక ఆ మహాభారత్ సీరియల్ లో ద్రౌపది పాత్రను నటి రూపా గంగూలీ పోషించారు. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తాను రీల్ జీవితంలోనే కాదు రియల్ జీవితంలో కూడా ద్రౌపదిగా మారానని గుర్తు చేసుకున్నారు.  

 

అసలు ఏమి జరిగిందన్న విషయానికి వస్తే... 2016 సంవత్సరంలో నేను రాజకీయ నాయకురాలిగా ఉన్నాను. ఆ సమయంలో 22 మే 2016  న కోల్కత్తాలోని డైమండ్ హార్బర్ వద్ద కొంత మంది వ్యక్తులు వచ్చినా చుట్టుముట్టారు. వారు నన్ను నేలకేసి కొట్టి చీరను లాగారు. అంతేకాదు నా తలను కారుకు కొట్టారు. నన్ను చంపాలనుకున్నారేమో తెలియదు. మా కార్యకర్తల సాయంతో నేను వారి నుంచి తప్పించుకోగలిగాను. అప్పుడు నాకు తీవ్ర గాయాలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నా కారు నేనే డ్రైవ్ చేశాను. మా మహిళా కార్యకర్తలు డైరెక్షన్స్ ఇస్తుంటే నేను కారు నడిపాను. ఇక అలాగే హాస్పిటల్ కు చేరుకున్నాను. ఇప్పటికి నాకు ఓ కన్ను కనిపించదు అంటే నమ్మండి. నాకు తగిలిన గాయాల నుంచి పూర్తిగా బయటపడ్డాను కానీ మనసుకు తగిలిన గాయం నుంచి బయటపడలేదని, నేను రియల్ జీవితంలో జరిగిన ద్రౌపది సీన్ ను గుర్తు చేసుకున్నారు రూపా గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: