టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిన సంగతే. అందులో ఎన్టిఆర్ వారసుడిగా బాల కృష్ణకు  మంచి గుర్తింపు ఉంది. నటుడిగానే కాక రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేసారు బాలయ్య. అయితే కెరీర్ పరంగా తన నటన, డైలాగ్స్ తో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమా అంటే అభిమానులు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి మరి సినిమా చూస్తారు. ఆయన యాక్షన్ సన్నివేశాలకు పిల్లలు, పెద్దలు అందరు ఫిదా అవ్వాల్సిందే. ఆయన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.   

 

బాల కృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తన 106 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే బాలయ్య మరొక సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. బాలయ్య కెరీర్ లో రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, నరసింహ నాయుడు, సమర సింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బి. గోపాల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్టు సినీ వర్గాల సమాచారం. బాల కృష్ణ తో భారీ సినిమాలు రూపొందించిన సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్.. 

 

తాజాగా బాలయ్య కోసం మరొక పవర్ ఫుల్ ప్రాజెక్ట్  సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ఒక టీనేజ్ అమ్మాయి చుట్టూ సాగే కథలో బాలయ్య ఆ అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నట్టు ఇండస్ట్రీలో పుకార్లు చక్కెర్లు కొడుతున్నాయి. వైవిధ్యమైన ఈ పాత్రలో బాలయ్య అభిమానులను అలరించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఫినిష్ అయినట్టు సమాచారం. అయితే బాలయ్య, బోయపాటి సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశo కనిపిస్తుంది.  ఈ సినిమా బాలయ్యకు మంచి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: