తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న వెంకటేష్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. అనుకోకుండా సినీ రంగ ప్రవేశం చేశారు వెంకటేష్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సారధ్యంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని సంపాదించారు వెంకటేష్. ఇప్పటి వరకు దాదాపు 70 కి పైగా సినిమాలలో నటించిన వెంకటేష్ 7 నంది అవార్డులు అందుకున్నారు. ఈయన సినిమాల ద్వారా చాలా మంది కథానాయికలు తెలుగు తెరకు పరిచయమయ్యారు.

 

వెంకటేష్ సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం 1992లో వచ్చిన “చంటి”. అప్పటి వరకు ఆవేశ భరిత యువకుడిగా ఉన్న పాత్రలనే చేసిన వెంకీ చంటి సినిమా తర్వాత కుటుంబ తరహా చిత్రాలను కూడా తీయగలడనే ముద్ర పడింది. చంటి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ సినిమాని  హిందీ, తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సంగీత పరంగా కూడా మంచి హిట్ అందుకుంది.  

 

చంటి సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనా నటించింది. వీరిద్దరి కాంభినేషన్ చూస్తే వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో 100 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో, కే ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో నాజర్ ప్రధాన విలన్ గా హీరోయిన్ కి అన్నయ్యగా అద్భుత నటన చూపించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాకు ఉత్తమ నేపధ్య గాయకునిగా ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారికి నంది పురస్కారం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: