తెలుగు ఇండస్ట్రీలో ఎన్టిఆర్ తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ హీరో చిరంజీవి. అంచలంచెలుగా ఎదిగి మెగా స్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. మన దేశం లో చిరంజీవికి  అభిమాన సంఘాలు కూడా ఎక్కువే. చిరంజీవి చెన్నై లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ నుండి డిప్లొమా పొందిన తరవాత 1978 లో పునాది రాళ్లు సినిమా తో వెండి తెరపై అడుగు పెట్టారు. అయితే కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. 

 

చిరంజీవి మొదటి సినిమాకు 1,116 రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు. చిరంజీవి కెరీర్ మొదట్లో ఓ మోస్తరుగా రాణించినా 1983 లో కోదండ రామి రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ సినిమా తో హీరోగా క్లిక్ అయ్యారు. ఈ సినిమా తర్వాత అసలు హీరో అంటే ఇలా ఉండాలి అనే విధంగా తన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో అశేష అభిమానులను సంపాదించారు. పరచూరి బ్రదర్స్ కథ అందించగా, ధనుంజయ్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మాధవి, సుమలత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా చిరు కెరీర్లో ఒక  మైలు రాయి గా నిలిచింది. 

 

అప్పుడే హీరోగా క్లిక్ అవుతున్న నేపధ్యంలో చిరుకి ఈ సినిమా స్టార్ స్టేటస్ నుండి మెగా స్టార్ గా నిలబెట్టింది. అయితే ఈ సినిమా నిజానికి సూపర్ స్టార్ కృష్ణ గారు చేయాల్సి ఉంది. ఆయన డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల చిరంజీవికి అవకాశం దక్కింది. ఖైదీ సినిమా చిరుకి ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఆ సినిమా కలెక్షన్స్ చూసి సౌత్ ఇండస్ట్రీ మొత్తం ముక్కున వేలేసుకునే విధంగా ఉన్నాయట. అంతగా చిరంజీవికి విజయం అందించింది కాబట్టే ఆ సినిమా అంటే చిరంజీవికి ఎనలేని అభిమానం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: