టాలీవుడ్ లో కొందరి సినిమాల గురించి ఎప్పుడు కూడా ఏదోక చర్చ జరుగుతూనే ఉంటుంది అనేది వాస్తవం. అందులో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ఎప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. అతని సినిమాల గురించి ఎవరో ఒకరు ఏదోక చర్చ చేస్తూనే ఉంటారు. అతని సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఏదోక రూపమ్లో చర్చల్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్అర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా ఆతర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది తెలియదు గాని బన్సాలి తో బాలీవుడ్ లో మాత్రం ఒక సినిమా చేసే అవకాశం ఉందని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమా కోసం అతను త్రివిక్రమ్ కి డెడ్ లైన్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాను త్వరగా పూర్తి చేస్తే తాను ఇక ముంబై వెళ్తాను అని అక్కడ దాదాపు గా ఏడాది పాటు ఉండాలి అని చెప్పాడట. త్వరగా సినిమాను పూర్తి చెయ్యాలని అతనికి చెప్పినట్టు కూడా సమాచారం. ఒకవేళ తాను ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నా సరే ఈ సినిమాను త్వరగా సెట్స్ మీదకు తీసుకుని వెళ్లి కీలక భాగాలను షూట్ చేసుకోవాలని చెప్పినట్టు సమాచారం. 

 

త్రివిక్రమ్ కూడా ఇప్పుడు అదే పని లో ఉన్నాడు అని తెలుస్తుంది. అనుకోకుండా బన్సాలి ఆఫర్ ఇవ్వడం తో ఎన్టీఆర్ కూడా ఒత్తిడి లో ఉన్నాడు అని అందుకే ఇప్పుడు డెడ్ లైన్ పెట్టాడు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని వార్తలు మాత్రం షికారు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: