టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ మళ్లీ వాయిదా పడుతోంది. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా భారీ అంచనాలను క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందట. ఎంత ట్రై చేసినా షూటింగ్ పూర్తి చేయడం కష్టమనీ ఈ మూవీని వాయిదా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. 

 

ట్రిపుల్ ఆర్ కోసం టాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ.. బాక్సాఫీస్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మాత్రం వీళ్ల ఎదురుచూపులను వాయిదా వేస్తూనే ఉంది. 

 

రాజమౌళి దర్శకత్వంలో హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది ట్రిపుల్ ఆర్. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను దాదాపుగా 400కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు డి.వి.వి దానయ్య. ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తుంటే.. తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. 

 

కాంబినేషన్ కాన్సెప్ట్ తోనే భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. టీజర్స్ తో అంచనాలను మరింత పెంచుకుంది. తెలుగునాట బాహుబలి రేంజ్ లో అదరగొడుతుందనే హైప్స్ క్రియేట్ చేసుకుంది ట్రిపుల్ ఆర్. అయితే అనౌన్స్ మెంట్ తోనే బ్లాక్ బస్టర్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ మాత్రం చెప్పిన టైమ్ కు జనాల ముందుకు రాలేకపోతోంది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతోంది ట్రిపుల్ ఆర్. 

 

రాజమౌళి అవుట్ పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. లేట్ అయినా పర్లేదు గానీ.. బెస్ట్ క్వాలిటీతోనే జనాల ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్  విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నాడు జక్కన్న. అలాగే ఈ మూవీ రిలీజ్ కు ఓ స్పెషల్ డేట్ ని కూడా లాక్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 


లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సినీజనాలు ట్రిపుల్ ఆర్ రిలీజ్ పై సందేహిస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా.. వాయిదా పడుతుందా.. అనే సందేహంలో ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం ట్రిపుల్ ఆర్ ను మ్యాగ్జిమమ్ పొంగల్ కు దింపుతామనే చెప్పాడు. కానీ ప్రొడ్యూసర్ దానయ్య మాత్రం ఈ మూవీ సంక్రాతికి రావడం కష్టమే అని క్లారిటీ ఇచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: